- Telugu News Photo Gallery Spiritual photos Pitru paksha 2021 date and significance know people pay respect to ancestors during this period
Pitru Paksha 2021: మహాలయ పక్షాలు ప్రారంభం.. పితృ దేవతలకు పూజలు… పండితులకు దానాలు ఎప్పటివరకు ఇవ్వొచ్చంటే..
హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.. ఈ సమయంలో తమ పూర్వీకులకు పూజలు చేస్తుంటారు. హిందూ క్యాలెండర్లో 16 చాంద్రమాన రోజుల కాలం. దాదాపు 15 రోజులు పూర్వీకులకు పూజలు చేస్తుంటారు.
Updated on: Sep 20, 2021 | 8:47 PM

భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం (21-09-21) నుంచి ప్రారంభమై.. అమావాస్య (6-10-21)రోజున ముగుస్తుంది. దాదపు 15 రోజులు పూర్వీకులకు పూజలు చేస్తుంటారు. అలాగే పూర్వీకుల పేరు మీద పండితులకు దానాలు చేస్తుంటారు.

ఈ పితృపక్షాలు.. సర్వపిత్రి అమావాస్య అంటారు.. దీనినే పితృ అమావాస్య.. పెద్దల అమావాస్య.. మహాలయ అమావాస్య అంటారు. చాలా సంవత్సరాలలో ఉత్తర అర్ధగోళం నుండి దక్షిణ అర్ధగోళానికి సూర్యుడి పరివర్తన ఈ కాలంలో వస్తుంది.

ఈ పదిహేను రోజులు.. శ్రాద్ధ కర్మలు చేయడం.. పూర్వీకులకు పూజలు చేయడం చేస్తుంటారు. మార్కాండేయ పురాణం ప్రకారం.. ఈ రోజులలో పూర్వీకులకు పూజలు చేయడం ద్వారా ఆరోగ్యం, సంపద వస్తుందని విశ్వాసం. అలాగే.. పితృ పూజలు చేయడం ద్వారా చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని... అంటుంటారు.

చాంద్రమాన రోజు నియమానికి నిర్ధిష్ట మినహాయింపులు ఉన్నాయి. జీవితంలో లేదా మరణంలో ఒక నిర్దిష్ట పరిస్థితిని బట్టి నిర్దిష్ట రోజులు నిర్దిష్ట మార్గంలో నిర్ణయిస్తారు.

గతేడాది మరణించిన వ్యక్తి కోసం.. నాల్గవ.. ఐదవ చంద్రరోజులలో పూజించాలి. అవివాధ నవమి..అంటే తొమ్మిదవ రోజున చనిపోయిన వివాహిత మహిళలను పూజించాలి.

పన్నెండవ చంద్ర రోజు చనిపోయిన పిల్లలు, సన్యాసులకు కేటాయించారు. పద్నాలుగో చాంద్రమాన రోజు ఆయుధాలు ఆసహజ మరణాన్ని పొందినవారికి కేటాయించారు..





























