Ramayanam Morals: రామాయణం ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను చూద్దాం..

Ramayanam Morals: హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. మనిషి ఎలా జీవించాలో రామాయణంద్వారా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువల్ని భోధించడమే కాదు.. వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. .

Ramayanam Morals: రామాయణం ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను చూద్దాం..
Ramayanam
Follow us

|

Updated on: Sep 21, 2021 | 6:50 AM

Ramayanam Morals: హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. మనిషి ఎలా జీవించాలో రామాయణంద్వారా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువల్ని భోధించడమే కాదు.. వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది.  మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాధ్వీమణి సీతమ్మ ఆడవారికి ఆదర్శం. ధైర్య సాహసాలు, సహనశీలత,  పితృవ్యాఖ్య పాలన, ధర్మనిరపేక్షత, దయార్దగుణం..  ఇలా అనేక గుణాలునాయికనుకనే శ్రీరాముడిని సకలగుణాభిరాముడు అంటారు. మనిషి ఎలా నడుచుకుంటే.. దేవుడిలా పూజింపబడతాడో.. తరతరాలుగా ఎలా కీర్తింపబడతాడో తెలిపిన సజీవ సాక్ష్యం శ్రీరాముడు.  శ్రీరాముడు గురించి తెలిపిన రామాయణంలో నేటి తరం వారికి ఆదర్శం..  క్షమ మూల ధర్మం ..  ధర్మ మూల జగత్తు అని తెలిపిన  రామాయణం చెప్పిన నీతులు అనేకం.. ఈరోజు ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో చూద్దాం..

*ప్రజలకు మేలు చేయడమే రాజు ధర్మం.. ప్రజలను హింసించే వారు స్త్రీ అయిన సరే జాలి చూపకుడదని తాటకి సంహారం మనకు తెలియచేస్తుంది. *తండ్రిమాటను మించిన ధర్మం లేదని తండ్రి ఆజ్ఞ్య మేరకు రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళడం ద్వార మనకు  తెలుస్తుంది. *స్త్రీలు అనుచితమైన మాటలు చెప్పడము సహజం..  వారి సలహాలను అలోచించి ఆచరించాలి అని సీతా బంగారు లేడీ ని అడిగడం ద్వార మనకు తెలుస్తుంది. * దుఃఖం మానవుడు మరణించేలా చేస్తుందని దశరధుని మరణం ద్వారా మనకు తెలుస్తుంది. *భర్త కష్టసుఖాల్లో సమానమైన భాగం పంచుకోవడమే పతివ్రత లక్షణమని సీతమ్మ రాముని తో అరణ్యానికి వెళ్ళడం ద్వారా తెలియజేస్తుంది. *పతివ్రతల కన్నీరు భూమి పై పడిన చొ అరిష్టమని సీతమ్మ కన్నీరు పెట్టినంతనే రావణుడి లంకా దహనం తో రావణుడి పతనము మొదలైనది.

*అంతేకాదు నేటి సమాజంలో కొంతమంది పెళ్లైన స్త్రీలు తాము అడిగినవి భర్త తేలేదని చిన్న చూపు చూస్తారు. అందరి ముందు తూలనాడడానికి కూడా వెనుకాడరు.. భర్తను చిన్న చూస్తూ అవహస్యం చేస్తూ అందరి ముందు లోకువగా మాట్లాడతారు.. పెళ్లైన స్త్రీ మూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో సీత మహాస్వాధీని ఉదాహరణగా తీసుకోవాలని రామాయణం తెలుపుతుంది.

సీతమ్మ రావణుడి లంక రాజ్యం, వైభవం అంతటిని గడ్డిపోచగా తలచింది. సీతమ్మ సుగుణాలకు ముచ్చటపడిన రాక్షస కాంతలు ఎందుకు నువ్వు రాజ్యం, వైభవం ఏ మాత్రం లేని రాముడిని భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు..  తిరిగి నువ్వు రాముడి వద్దకు చేరినా నీకు కష్టాలు తప్ప ఏముంటాయని అడుగుతారు, వారికీ తన భర్త గురించి సీతమ్మ చెప్పిన సమాధానం అద్భుతం. రాజ్యం లేకపోయినా ఇక్ష్వాకుల వంశ తిలకుఁడైన తన పతి శ్రీరాముడిని ఎల్లవేళలా అనుసరిస్తామని చెప్పింది.

Also Read:

సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి టికెట్లు..