Panchamukha Hanuman: మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి ఏ విధంగా పూజిస్తే శుభఫలితాలు పొందుతారంటే..

Panchamukha Hanuman Pooja: రామభక్త హనుమాన్ దేశంలో అనేక ఆలయాలున్నాయి.  హనుమంతుడు చిరంజీవి.. సూర్యుడి వద్ద సర్వ విద్య లను నేర్చుకున్న నవ వ్యాకరణ పండితుడు. హనుమంతుడు రుద్రాంశ కలవాడు..

Panchamukha Hanuman: మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి ఏ విధంగా పూజిస్తే శుభఫలితాలు పొందుతారంటే..
Panchamukha Hanuman
Follow us
Surya Kala

|

Updated on: Sep 21, 2021 | 7:14 AM

Panchamukha Hanuman Pooja: రామభక్త హనుమాన్ దేశంలో అనేక ఆలయాలున్నాయి.  హనుమంతుడు చిరంజీవి.. సూర్యుడి వద్ద సర్వ విద్య లను నేర్చుకున్న నవ వ్యాకరణ పండితుడు. హనుమంతుడు రుద్రాంశ కలవాడు . ఆంజనేయుని పూజిస్తే అందరు దేవతలను పూజించినట్లే. వైశాక బహుళ దశమి శనివారం నాడు పూర్వాభద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో హనుమంతుడు జన్మించాడని పురాణాల కథనం. ఇక హనుమంతుడి తొమ్మిది అవతారల్లోకి ఒకటి.. పంచముఖ ఆంజనేయస్వామి. ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం..  భూత, ప్రేత, గాలి, పీశాచాలను దగ్గరికి కుడా రాకుండా చేసే ,  క్షుద్ర భాదల నుండి కాపాడే మహామహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయుడిని మంగళవారం ఏ విధంగా పూజించాలో చూద్దాం..

*తనను భక్తితో పూజించినవారు కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే అమితమైన ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలని పండితులు చెబుతారు. అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు ఇస్తాడు *హనుమంతుని పూజలో అప్పాలని సమర్పిస్తే.. బుద్ధి బలం కీర్తి ధైర్యం ,  ఆరోగ్యం చురుకుదనం మాటకారితనం కలుగుతాయి . *తమలపాకులు , మారేడు, తులసి , ఉసిరిక , గరిక , నేరేడు , జమ్మి , ఉత్తరేణి , జిల్లేడు ఆకులతో హనుమంతుడి పూజ అత్యంత ప్రశస్తం. *మొల్ల, మల్లి , మందార, పారిజాత, నీలాంబర, కనకాంబర, నంది వర్ధనం,  మెట్ట తామర పూలు హనుమంతుడుకి ఇష్టమైనవి. *నిమ్మ , అరటి , పనస , మామిడి , ద్రాక్ష , దానిమ్మ పండ్లు చెరకు గడలు హనుమంతుడు కి ఇష్టమైనవి . *జిల్లేడు చెట్టు క్రింద హనుమంతుడిని పూజిస్తే చాలా శుభకరం . సింధూరంతో మంగళ వారం నాడు హనుమంతుడిని పూజిస్తే లాభ ప్రదం.

హనుమంతుడికి నివేదించే పదార్థాలు 5 సంఖ్యలో ఉంచాలి . హనుమాన్ చాలీసా 11 మార్లు తగ్గకుండా ప్రతి రోజు పారాయణ చేయడం సుందర కాండ పారాయణ తో సమానం . 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి 11 మార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జారుతాయి. హనుమంతుడికి ప్రతి ఉదయం 11 ప్రదక్షిణలు చేయడంవలన సర్వ దోషాలు నశించి శుభం కలుగుతుంది.  అయితే భక్తి లోపం ఉంది.. ఎంత వైభంగా పూజ చేసినా వ్యర్ధమే.. శ్రీరాముడికి పరమభకుడైన హనుమ భక్తసులభుడు. ఆయన కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి, భజన చేస్తే ఆ ప్రదేశానికి హనుమ ఎదో ఒక అవతారంలో వస్తాడని పెద్దల నమ్మకం.

Also Read: Ramayanam Morals: రామాయణం ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను చూద్దాం..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..