White Challenge: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్‌కు తాను రెడీ.. యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అని బండి సంజయ్ కామెంట్..
తెలంగాణలో హాట్ హాట్‌గా నడుస్తున్న వైట్ ఛాలెంజ్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని...
తెలంగాణలో హాట్ హాట్‌గా నడుస్తున్న వైట్ ఛాలెంజ్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ తాను రెడీ అన్నారు. చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆయన తేల్చి చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్‌కి తనదైన తరహాలో స్పందించారు.
ప్రజాసంగ్రామ యాత్ర తర్వాత టెస్టు కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని అన్నారు బండి సంజయ్. అక్టోబర్ 2వ తేదీన తన పాదయాత్ర ముగియనుందన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత టెస్టుల కోసం వస్తానని చెప్పారు బండి సంజయ్. తనకు ఎలాంటి అలవాట్లు లేవని వెల్లడించారు.
బాగా బలిసి బలుపు ఎక్కినోడే డ్రగ్స్ తీసుకొంటాడని బండి సంజయ్ చెప్పారు. KCR ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తనపై రాజద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..