Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతకీ.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ సర్కారు నుంచి ఏం కోరుకుంటోంది.. ప్రభుత్వం ఏమంటోంది?

టాలీవుడ్ సినీ పెద్దలతో కాసేపట్లో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు హాజరుకానున్నారు.

ఇంతకీ.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ సర్కారు నుంచి ఏం కోరుకుంటోంది.. ప్రభుత్వం ఏమంటోంది?
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 20, 2021 | 10:44 AM

AP Film Industry: టాలీవుడ్ సినీ పెద్దలతో కాసేపట్లో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని చర్చలు జరపనున్నారు. ఇంతకీ, సినీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది. ప్రభుత్వం ఏమంటోంది? అనే వివరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో… లవ్‌ స్టోరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా కుండబద్దలు కొట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. మెరిసేదంతా బంగారం కాదనే విషయాన్ని ప్రభుత్వానికి సూటిగా చెప్పేశారు. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉందంటే అందరూ బాగున్నారని కాదనే సంగతిని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు.

కేవలం, ఐదారుగురు హీరోలో.. ఐదారుమంది ప్రొడ్యూసర్లో.. మొత్తం సినీ ఇండస్ట్రీ కాదన్నారు. డైరెక్టర్లు బాగా సంపాదిస్తున్నారు.. హీరోలు భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారనేది కొద్దిమందే అన్నారు. ఈ ఐదారుగురు కోసం మిగతా వాళ్లకు ఇబ్బందులు కలిగేలా నిర్ణయాలు తీసుకోవద్దన్నారు చిరంజీవి. మేము ఆశగా అడగట్లేదు.. అవసరానికి అడుగుతున్నాం.. దయచేసి మా పరిస్థితిని అర్ధం చేసుకోండి.. కనికరించండి అంటూ మెగాస్టార్ వేడుకున్నారు.

ఇంతకీ, ప్రభుత్వాల నుంచి సినీ ఇండస్ట్రీ ఏం ఆశిస్తున్నాయ్? ప్రభుత్వాలకు గతంలో ఎలాంటి విజ్ఞప్తులు చేశారు? ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎలా స్పందించాయ్? అనేది క్లారిటీ లేదు. మెగాస్టార్ చిరంజీవి మాటల ప్రకారం ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించినా… ఇంకా జీవోలు ఇవ్వలేదనే సంగతి మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.

సినిమా నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిపోయింది.. కానీ, అందుకు తగ్గట్టుగా రెవెన్యూ రావడం లేదన్నది మెగాస్టార్ మాట. అందుకే, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి.. గ్రేడ్-2 కేంద్రాల్లో టికెట్‌కు 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.. ఇలా, పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టనున్నారు సినీ పెద్దలు.

అయితే, బెనిఫిట్ షోల పేరుతో ఇష్టానుసారం రేట్లను పెంచేస్తున్నారన్నది ప్రభుత్వ వాదన. పైగా, పెద్ద హీరోల సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావడం లేదన్నది సర్కార్ మాట. అందుకే, టికెట్ రేట్లు, టికెట్ల విక్రయాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటోంది ప్రభుత్వం.

Read also: Ganesh Laddu: భాగ్యనగరాన వేలం పాటలో టాప్ 10లో నిలిచిన గణేశ్ లడ్డూలు ఇవే..