Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Laddu: భాగ్యనగరాన వేలం పాటలో టాప్ 10లో నిలిచిన గణేశ్ లడ్డూలు ఇవే..

రాజధాని నగరం హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మహోత్సవంలో గణేశ్ లడ్డూల

Ganesh Laddu: భాగ్యనగరాన వేలం పాటలో టాప్ 10లో నిలిచిన గణేశ్ లడ్డూలు ఇవే..
Balapur Laddu
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 20, 2021 | 11:09 AM

Vinayaka Laddu: రాజధాని నగరం హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మహోత్సవంలో గణేశ్ లడ్డూల ప్రత్యేకత కూడా ఒక మహాద్భుతమే. 2021.. ఈ ఏడాది వినాయకుడి లడ్డూల వేలం పాటలో టాప్ 10లో నిలిచిన గణేశ్ లడ్డూలు ఏవేంటో చూద్దాం..

బాలాపూర్ లడ్డు – 18. 9 లక్షలు మై హోమ్ భూజా – 18. 5 లక్షలు చేవెళ్ల రచ్చబండ – 14.01 లక్షలు ఉప్పరపల్లి – 11. 11 లక్షలు వీరాంజనేయ భక్తి సమాజం, బడంగ్ పేట – 10. 50 లక్షలు వీరభద్ర భక్తి స్వామి సమాజం, మంచిరేవుల – 8. 10 లక్షలు బౌరంపేట – 7. 2 లక్షలు సర్దార్ పటేల్ నగర్ – 6. 51 లక్షలు అత్తాపూర్ – 6. 50 లక్షలు నవజ్యోతి యువజన సంఘం, మణికొండ – 6. 5 లక్షలు

ఇక, ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కే బాలాపూర్‌లో లడ్డూ ఈ ఏడాదీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ఏకంగా 18 లక్షల 90 వేల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ ఈసారి వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా సాగిన వేలంలో మర్రి శశాంక్‌ రెడ్డి ద్వయం లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి.

గతేడాది 17లక్షల 60వేల రూపాయల ధర పలకగా.. ఈసారి 18లక్షల 90వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు మర్రి శశాంక్‌రెడ్డి. 26 ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న బాలాపూర్‌ గణేశుడు.. ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకేత్తించాడు. ఇక, గతేడాది కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Read also: Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు