Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..
Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన
Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరం జరిగింది. ముంబైలోని వెర్సోవా సముద్రతీరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు బాలురు నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరిని కాపాడినట్లు వెల్లడించారు. అనుమతి లేని ప్రదేశానికి ఆ బాలురు నిమజ్జనం కోసం వెళ్లారని.. ఈ క్రమంలో అలల ధాటికి ఐదుగురు నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కూపర్ ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో నిమజ్జనం సందర్భంగా గల్లంతైన ముగ్గురు బాలుర కోసం ముంబై అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన బాలుర కోసం గాలించేందుకు పోలీసు బోటుతోపాటు నేవి సిబ్బందిని కూడా రంగంలోకి దించామని ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
Maharashtra | Locals came without permission as there were restrictions on immersion at Versova beach. Our team came with a doctor to rescue drowned children. Two were rescued &given first aid &sent to hospital. Resue operation for 3 others underway: Police Naik Manoj W Pohanekar pic.twitter.com/SIUDPRbJwz
— ANI (@ANI) September 19, 2021
గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనల్లో దేశవ్యాప్తంగా 19 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది, ఉత్తరప్రదేశ్లో 5, రాజస్థాన్లో ఇద్దరు, మహారాష్ట్రలో నలుగురు మరణించారు. యూపీలోని బారాబంకీ జిల్లాలోని కల్యాణి నదిలో నిమజ్జనం సందర్భంగా ఓ మహిళ, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండీ జిల్లాలో నిమజ్జనం సందర్భంగా నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో చెరువులో ఇద్దరు మునిగి చనిపోయారు.
Also Read: