Punjab CM: గురుద్వారాలో ప్రత్యేక పూజలు.. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్ సింగ్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం
పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన..
Charanjit Singh Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దారి పొడవునా కొత్త సీఎంకు ఘనస్వాగతం పలికారు స్థానిక ప్రజలు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ముందు సుఖ్జీందర్ సింగ్ అని వార్తలు వచ్చినా.. కాసేపటికే చరణ్‌జీత్ సింగ్ పేరును ప్రకటించారు. ఐతే కొత్త సీఎంగా చరణ్ జీత్ ఎంపికలో రాహుల్ గాంధీ జోక్యం ఉందని.. చన్నీ ఎంపికకు ముందు చాలా కసరత్తే జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. చరణ్‌జీత్ ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి ఆయన నిన్న సాయంత్రం లేఖ అందించారు.
పంజాబ్ లో ఎన్నికల వేళ ఆప్, అకాళీదళ్, బీజేపీలను కార్నర్ చేసేలా కొత్త సీఎం ఎంపిక ఉండాలని రాహుల్ పట్టుబట్టినట్టు సమాచారం. అందుకే తీవ్ర తర్జనభర్జన తర్వాత చరణ్‌జీత్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Read also: Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు