Milk Adulteration Test: మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా.. లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి..

 Milk Adulteration Test: ప్రస్తుతం మనిషి ధనార్జనే ధ్యేయంగా బతుకుతూ... చేస్తున్న అక్రమాల్లో ఒకటి కల్తీ.. అవును తినే తిండి కల్తీ, తాగే నీరు కల్తీ, ఆరోగ్యం కోసం వేసుకునే మందులు కల్తీ..ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, పంచదార,..

 Milk Adulteration Test: మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా..  లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి..
Adulteration In Milk
Follow us

|

Updated on: Sep 20, 2021 | 1:22 PM

Milk Adulteration Test: ప్రస్తుతం మనిషి ధనార్జనే ధ్యేయంగా బతుకుతూ… చేస్తున్న అక్రమాల్లో ఒకటి కల్తీ.. అవును తినే తిండి కల్తీ, తాగే నీరు కల్తీ, ఆరోగ్యం కోసం వేసుకునే మందులు కల్తీ..ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, పంచదార, నూనె, నెయ్యి, కారం, టీపొడి, పెట్రోల్, ఇది అది అని లేదు.. మనిషి చేయని కల్తీ వస్తువు ఏదీ లేదనే చందంగా మారిపోయింది తాజా పరిస్థితి. కల్తీ  వస్తువుల జాబితాను సిద్ధం చేస్తే ఆది అంతం ఉందని సామాన్యుడి వ్యాఖ్యానిస్తుంటాడు. ఏది అసలు, ఏది నకిలీ అన్నది తేల్చుకోవడం వినియోగదారుడికి సవాల్.. అలాంటి కల్తీ వసువుల జాబితాలో పాలు కూడా చేరిపోయాయి. పాలల్లో నీరు కలపడం సర్వసాధారణం అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి.. స్వచ్ఛమైన పాలను కృతిమంగా యూరియా వంటివాటితో సృష్టిస్తున్నారు. ఏవి అసలు, ఏవి నకిలీ పాలో తేలిక ఆ కల్తీ పాలను తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాదు పిల్లల పెరుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి..

పాలల్లో నీరు:  పాలు పాలలో నీరు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం..  ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై  ఒక చుక్క పాలు వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే ఆ పాల చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదులుతుంది. అదే నీరు కలిసిన పాలు అయితే వేసిన వెంటనే జర్రున జారుతూ కిందకు చేరుకుంటాయి.

పిండి పాలు గుర్తించడానికి:  పాలను స్టార్చ్ లాడిన్ ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి.. అవి నీలం రంగులోకి మారితే..  పాలల్లో పిండి కలిపినట్లు లెక్క

యూరియా తో పాల తయారీ గుర్తింపు :  ఒక చుక్క పాలను తీసుకుని యూరియా ఒక టెస్ట్ ట్యూబ్‌లో వేయండి.. దానిలో కొంచెం పసుపుని వేయండి.. తర్వాత బాగా కలపండి. కొంచెం సేపటి తర్వాత  ఆ పాలకు ఎరుపు లిట్మస్ కాగితాన్ని జోడించండి. ఈ కాగితం నీలం రంగులోకి మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.

సింథటిక్ పాలు:  ఈ పాలు చేదుగా ఉంటాయి. అంతేకాదు పాలను తీసుకుని చర్మంపై రుద్దితే.. సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది.  అంతేకాదు ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారుతాయి. దు

సబ్బు పొడితో పాలు:  డిటర్జెంట్ 5 నుండి 10 మి.లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఎక్కువ నురుగు వస్తే.. ఆ పాలల్లో డిటర్జెంట్  కలిపినట్లు లెక్క.

ఇక కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్ లో యూరియా స్ట్రిప్  దొరుకుతున్నాయి. వీటి సాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు,

కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం.. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి వస్తుంది. అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి. సోడియం వంటి పదార్థాలు శరీరంపై ప్రభావం చూపిస్తాయి. గుండెజబ్బులకు కారణమవుతాయి. అంతేకాదు పిల్లల ఎదుగుల కుంటుబడుతుంది.  కనుక స్వచ్ఛమైన పాలను తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి.

Also Read:  తమిళనాడు పంచాయతీ ఎన్నికల బరిలో హీరో విజయ్ పార్టీ.. రెండో రోజుల్లో అభ్యర్థుల ప్రకటన