Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 సుగంధ ద్రవ్యాలతో సులువుగా బరువు తగ్గవచ్చు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..

Weight Loss Tips : బరువు తగ్గడం అనేది సమతుల్య ఆహారం, వ్యాయామం ఫలితంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ

ఈ 5 సుగంధ ద్రవ్యాలతో సులువుగా బరువు తగ్గవచ్చు..! కొద్ది రోజుల్లోనే తేడా గమనిస్తారు..
Weight Loss Tip
Follow us
uppula Raju

|

Updated on: Sep 20, 2021 | 9:38 AM

Weight Loss Tips : బరువు తగ్గడం అనేది సమతుల్య ఆహారం, వ్యాయామం ఫలితంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ ఆహారం అసంపూర్ణం. అవి మీ ఆహారంలో రుచిని పెంచడమే కాదు బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలు సహజ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కూడా తోడ్పడుతాయి. ఈ మసాలా దినుసుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. పసుపు పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పసుపును కరివేపాకుతో పాటు మరిగించి తీసుకుంటే చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

2. దాల్చిన చెక్క దాల్చిన చెక్కను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజూ దాల్చినచెక్క నీరు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. సులువుగా బరువు తగ్గుతారు. ఒక వ్యక్తి ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే అతను తినే పిండి పదార్థాలు చక్కెరగా మారుతాయి. ఎందుకంటే జీవక్రియ సరిగా జరగదు మొత్తం కొవ్వుగా మారుతుంది. దాల్చినచెక్క ఈ కొవ్వును కరిగిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

3. సోంపు గింజలు చాలా మంది తిన్న తర్వాత సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు మంచిది. ఉదయం సమయంలో నీటిలో వేసి మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోంపులో విటమిన్లు ఎ, సి, డి, యాంటీ-ఆక్సిడెంట్ల మంచి మూలం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. జీలకర్ర జీలకర్ర అనేది సాధారణం మసాలా. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతి రాత్రి ఒక టీస్పూన్ జీలకర్రను నానబెట్టి ఉదయం నీటిలో కలిపి తాగండి. ఇది బెల్లీ ఫ్యాట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు దీనిని సూప్స్, పప్పు, కూరలలో కూడా ఉపయోగించవచ్చు.

5. మెంతులు మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. మీ ఆహారంలో కొవ్వు, కేలరీల మొత్తాన్ని తగ్గించడంలో మెంతి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు మెంతులను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

US Corona: అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం.. రోజూ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు

చాణక్యనీతి: శత్రువును జయించాలంటే చాణక్య ఈ 3 విషయాలు చెబుతున్నాడు..! ఏంటంటే..?

Megastar Chiranjeevi: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో అమీర్ ఖాన్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో)