Oil Purify Test vide: మీరు వాడే నూనె స్వచ్ఛమైనదేనా.. తెలుసుకోండి ఇలా..!(వీడియో)

Oil Purify Test vide: మీరు వాడే నూనె స్వచ్ఛమైనదేనా.. తెలుసుకోండి ఇలా..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 20, 2021 | 9:34 AM

నిత్యావసరాల్లో వంటనూనె ప్రధానమైనది. అయితే కొన్ని రోజులుగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నూనె లేకుండా వంట చేయలేము కాబట్టి ధర ఎంతైనా నూనె కొనడం తప్పనిసరి. ఈ క్రమంలో ఓవైపు ధరలు మండిపోతుంటే మరోవైపు కల్తీ నూనెల బెడదొకటి....

నిత్యావసరాల్లో వంటనూనె ప్రధానమైనది. అయితే కొన్ని రోజులుగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నూనె లేకుండా వంట చేయలేము కాబట్టి ధర ఎంతైనా నూనె కొనడం తప్పనిసరి. ఈ క్రమంలో ఓవైపు ధరలు మండిపోతుంటే మరోవైపు కల్తీ నూనెల బెడదొకటి. కల్తీ నూనెలు తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు మోసగాళ్లు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ కల్తీ ఆగడంలేదు. ఈ ఆహార పదార్ధాల కల్తీ వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాలు వేధిస్తున్నాయి. అయితే మనం కొనే నూనె స్వచ్ఛమైనదా.. కల్తీదా అని మనం తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ వీడియోను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అది ఎలాగంటే..

ప్రధానంగా వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారట. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. కాబట్టి ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం పుతుందట. ఇది పక్షవాతం తదితర రోగాలకు దారితీస్తుందట. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీ.. అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చంటుంది ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా.

మీరు వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీని అర్థం. నూనెలో అది ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా రెండు మి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి. కొద్దిసేపయ్యాక చూస్తే పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె. అంటే అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగులోకి వస్తే అది కల్తీ అయినట్లు అర్థం. ఇలా మీరు తెచ్చుకున్న నూనె స్వచ్ఛమైనదో కాదో టెస్ట్‌ చేసుకొని, కల్తీలేని నూనెనే వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch: విజయవాడలో డ్రగ్స్ కలకలం | ప్రశాంతంగా నిమజ్జనం | దావోస్ కు కేటీఆర్ మరిన్ని వార్తల కొరకు న్యూస్ వాచ్…(వీడియో)

 Indian kidnapped in Kabul video: కాబూల్‌లో ఇండియన్‌ వ్యాపారి కిడ్నాప్‌.. నడిరోడ్డుపై తుపాకులతో బెదిరించి…(వీడియో)

 Warangal Kakatiya Medical College: ర్యాగింగ్ కలకలం.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తో బట్టలిప్పించి..!(వీడియో)

 Sarkaru Vaari Paata Movie: బుల్లెట్ బండిపై మహేష్ బాబు.. సర్కారు వారి పాట నుంచి మరో లీక్‌ ..?(వీడియో)