Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaipur hotel Video: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్..  ఒక రోజు ఆ గది అద్దె డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు(వీడియో)

Jaipur hotel Video: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్.. ఒక రోజు ఆ గది అద్దె డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 20, 2021 | 9:41 AM

రాజస్థాన్‌లో ఖరీదైన హోటళ్లు చాలా ఉంటాయి...ప్యాలెస్ మాదిరి నిర్మించిన ఈ హోటళ్లలో ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. అందుకు తగినట్లుగానే రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఈ హోటళ్లలో ధనవంతులు మాత్రమే స్టే చేయగలుగుతారు. ఆ హోటళ్లలో ఒక వారం పాటు స్టే చేస్తే ఖర్చుచేసే డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ..

రాజస్థాన్‌లో ఖరీదైన హోటళ్లు చాలా ఉంటాయి…ప్యాలెస్ మాదిరి నిర్మించిన ఈ హోటళ్లలో ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. అందుకు తగినట్లుగానే రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఈ హోటళ్లలో ధనవంతులు మాత్రమే స్టే చేయగలుగుతారు. ఆ హోటళ్లలో ఒక వారం పాటు స్టే చేస్తే ఖర్చుచేసే డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా జైపూర్‌లోని ఒక హోటల్ గురించి, అందులో ఉన్న ఓ గది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇది జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్. జైపూర్‌లోని ఈ ఫైవ్ స్టార్ హోటల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ హోటల్ లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరు. హెరిటేజ్ లైన్స్‌పై నిర్మించిన ఈ హోటల్.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చాలా మందిని దీనికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో అనేక రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గదుల అద్దె సాధారణంగా 30, 40 వేల నుండి మొదలవుతుంది. అయితే, గదులు అనేక కేటగిరీలలో అందుబాటులో ఉంటాయి. ఆయా గదులను బట్టి ధరల పట్టికలు కూడా మారుతుంటాయి.

అయితే, ఈ హోటల్‌లో ఒక ప్రత్యేక గది ఉంది. దీనిని సుఖ్ నివాస్ అని పిలుస్తారు. ఈ గది చాలా ప్రాముఖ్యత కలిగింది. అంతేకాదు.. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ గదులలో ఒకటిగా పేరుగాంచింది. దీనిని ప్రెసిడెన్షియల్ రూమ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది తాజ్ హోటల్స్‌లో భాగంగా ఇది.ఇక పోతే… ఈ గది రాచరిక శైలికి ప్రసిద్ధి చెందింది అని… దాని ఫోటోలను బట్టి చెప్పొచ్చు ఆ గదిలో ఉండటం ఎంత ప్రత్యేకమో..? ఎంట్రీ రూట్ మొదలు.. తోట, మొక్కలు, పూల వనాలు కలిగిన ఈ గది పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రాయల్ డైనింగ్ రూమ్ సహా, డ్రెస్సింగ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్‌ కలిగి ఉంది. ఈ గదిలో స్టే చేస్తే మహారాజు అనుభూతిని పొందుతారు. అందుకే ప్రముఖులందరూ ఈ గదిలో ఉండేందుకు ఇష్టపడుతారు.ఇక ఛార్జీల విషయానికి వస్తే సామాన్య ప్రజలు దీని రెంట్ తెలుసుకుంటే హడలిపోతారు. దీని రెంట్.. సమయానుగుణంగా మారుతుంటుంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ గది ఒక రోజు రెంట్ సుమారు రెండున్నర లక్షల రూపాయలు. కానీ, కొన్నిసార్లు దీనికి డిమాండ్ పెరిగినప్పుడు ఒక రోజు రెంట్ 10 లక్షల వరకు కూడా ఉంటుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Oil Purify Test vide: మీరు వాడే నూనె స్వచ్ఛమైనదేనా.. తెలుసుకోండి ఇలా..!(వీడియో)

 News Watch: విజయవాడలో డ్రగ్స్ కలకలం | ప్రశాంతంగా నిమజ్జనం | దావోస్ కు కేటీఆర్ మరిన్ని వార్తల కొరకు న్యూస్ వాచ్…(వీడియో)

 Indian kidnapped in Kabul video: కాబూల్‌లో ఇండియన్‌ వ్యాపారి కిడ్నాప్‌.. నడిరోడ్డుపై తుపాకులతో బెదిరించి…(వీడియో)

 Warangal Kakatiya Medical College: ర్యాగింగ్ కలకలం.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తో బట్టలిప్పించి..!(వీడియో)