US Corona: మళ్లీ కరోనా స్వైర విహారం.. రోజూ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.!

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్పీడ్‌గా కొనసాగుతున్నా..

US Corona: మళ్లీ కరోనా స్వైర విహారం..  రోజూ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.!
Us Corona
Follow us

|

Updated on: Sep 20, 2021 | 9:11 AM

Delta Variant: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్పీడ్‌గా కొనసాగుతున్నా.. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ 2 వేల మందికి పైగా మృతి చెందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సస్‌, కాలిఫోర్నియాలో అత్యధికంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరగడం టెన్షన్‌ పెడుతోంది. ఐతే డెల్టా వేరియంట్‌ కారణంగానే కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా నమోదవుతున్న కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్‌వేనని చెబుతున్నారు అమెరికా వైద్యులు. ఇక ఇప్పటివరకు అమెరికాలో 54 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మంది ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు.

అటు, ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని వచ్చింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు బయటకొచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,38,690 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,070 మంది మరణించారు. రాష్ట్రంలో 14,699 యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,09,921 మంది రికవరీ అయ్యారు.

Read also: Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు