Aliens: హోటల్ గదిలో నుంచి ఒక్కసారిగా కాల్పులు.. ఏలియన్స్ అటాక్ చేసాయంటోన్న వ్యక్తి
ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ..అసలు ఉన్నారో లేదో తెలియదు.. ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో మాత్రం ఏలియన్స్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ..అసలు ఉన్నారో లేదో తెలియదు.. ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో మాత్రం ఏలియన్స్‌పై రోజూ రచ్చ జరుగుతూ ఉంటోంది.. ఇప్పుడు కూడా ఓ వ్యక్తి.. ఏలియన్స్ తనకు కనిపించాయని, అవి తన రూమ్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా.. వాటిపై కాల్పులు జరిపానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ వార్త నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఏలియన్స్ పేరుతో ఎలాంటి వార్తలు వచ్చినా.. ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక మొన్నటి మొన్న ఓ మహిళ.. తనను ఏలియన్స్ చాలాసార్లు కిడ్నాప్ చేశాయంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక తాజాగా అమెరికాలోని కెంటుకీ హోటల్‌లో ఉంటున్న శామ్యూల్ రిడెల్ అనే వ్యక్తి తనకు ఏలియన్స్ కనిపించాయని తెలిపాడు. అంతేకాదు తాను ఉంటున్న రూమ్ కిటికీలో నుంచి పార్కింగ్ వైపుకు చూడగా.. అప్పుడు ఏలియన్స్ కనిపించాయని చెప్పుకొచ్చాడు.
తనను గమనించిన ఏలియన్స్.. తన రూమ్ వైపుకు రావడం చూసి భయపడిపోయానని తెలిపాడు శామ్యూల్. దీంతో వెంటనే తన వద్ద ఉన్న గన్‌తో ఏలియన్స్‌పైకి కాల్పులు జరిపిన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సడెన్‌గా అవి కనిపించకుండా పోయావని అన్నాడు. అతడు జరిపిన కాల్పుల్లో.. ఒక బుల్లెట్ హోటల్‌లోని మరో గదిలోకి వెళ్లింది. ఇంకొన్ని బుల్లెట్లు హోటల్ పార్కింగ్ స్థలంలోని కొన్ని కార్లను కూడా తాకాయి. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇక హోటల్ గది నుంచి కాల్పుల శబ్దం రావడంతో వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శామ్యూల్ చెప్పిన సమాధానం విని షాక్ గురి అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు.. ఆ తల్లి ఆవేదన అంతా, ఇంతా కాదు..