US Corona Cases: అమెరికాలో మళ్లీ కరోనా కలవరం.. నిత్యం 2 వేలకు తగ్గని కోవిడ్ మరణాలు.. పిల్లల్లో పెరుగుతున్న కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

US Corona Cases: అమెరికాలో మళ్లీ కరోనా కలవరం.. నిత్యం 2 వేలకు తగ్గని కోవిడ్ మరణాలు.. పిల్లల్లో పెరుగుతున్న కేసులు
Coronavirus
Follow us

|

Updated on: Sep 20, 2021 | 8:10 AM

America Corona Cases: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయని అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది.

కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్‌ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ నిబంధనలతో కాస్త కట్టడి పడింది. మళ్లీ లాక్‌డౌన్ ఎత్తివేత, జనజీవనం సాధారణస్థితికి చేరడంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం 1.65 లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయితే, కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి.

Us Corona Cases

Us Corona Cases

అయితే, డెల్టా వేరియంట్‌ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా హాస్పిటల్స్‌ల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి, ఆగస్టు చివరి వారంలో నాలుగు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అత్యధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సీడీసీ తెలిపింది.

Read Also…  Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..!

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి స్త్రీవలన ఆకస్మిక ధనం కలుగుతుంది.. ఏ రాశివారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుందంటే..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..