Covid-19 Third Wave: పిల్లలకు కరోనా ముప్పు తక్కువే.. తేల్చి చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!

"థర్ట్ వేవ్" ఈ పదం వింటేనే ప్రపంచవ్యాప్తంగా వెన్నులో వణుకు పుడుతుంది. మొదటి, రెండు విడతల్లో కరోనా మహమ్మారి విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, నిపుణులు పేల్చిన బాంబుతో హడలెత్తిపోతున్నారు జనం.

Covid-19 Third Wave: పిల్లలకు కరోనా ముప్పు తక్కువే.. తేల్చి చెప్పిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ..!
Covid 19 In Kids
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 20, 2021 | 8:40 AM

Covid-19 in Children: “థర్ట్ వేవ్” ఈ పదం వింటేనే ప్రపంచవ్యాప్తంగా వెన్నులో వణుకు పుడుతుంది. మొదటి, రెండు విడతల్లో కరోనా మహమ్మారి విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, నిపుణులు పేల్చిన బాంబుతో హడలెత్తిపోతున్నారు జనం. ఇదివరకే కొన్ని దేశాల్లో థర్ట్ వేవ్ ప్రారంభం కాగా, మన దేశంలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యా థర్ట్ వేవ్ వచ్చే సంకేతాలు కనపడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కరోనా థర్ట్ వేవ్‌లో ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

సెప్టెంబరు లేదా అక్టోబరులో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి పిల్లలకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని నిపుణులు కూడా హెచ్చరించారు. అయితే, తాజాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇచ్చింది. పిల్లలపై కరోనా ముప్పు లేదని WHO స్పష్టం చేసింది. పిల్లల్లో కొవిడ్‌ వ్యాప్తి, వారిలో కరోనా వ్యాధి తీవ్రత.. రెండూ తక్కువేనని వెల్లడించింది. అంటే పిల్లలకు కరోనా సోకే అవకాశం తక్కువని తేల్చి చెప్పారు. ఒకవేళ సోకినా పెద్దగా ప్రభావం ఉండదన్నారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాల ప్రకారం.. మొత్తం కరోనా బాధితుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1.8 శాతం మాత్రమేనని డబ్ల్యూహెచ్‌‌వో తెలిపింది. చిన్నారుల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయని, వయసు పెరుగుతున్న కొద్దీ కేసుల్లో వృద్ధి కనిపిస్తోందని వెల్లడించింది. కోవిడ్-19 బాధితుల్లో 6-14 ఏళ్ల వయసు వారు 6.2 శాతం మంది ఉంటే.. 15-24 ఏళ్ల మధ్యవయసు వారు ఏకంగా 14.3 శాతం మంది ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. చిన్నారుల్లో మరణాలు కూడా తక్కువగానే నమోదయ్యాయని తెలిపింది.

మరోవైపు, కరోనా మరణాల్లో 99.8 శాతం మరణాలు 15 ఏళ్ల పైబడిన వారిలోనే రికార్డయ్యాయి. అయితే, ఏడాది లోపు శిశువుల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువే ఉన్నప్పటికీ.. ఒకవేళ కరోనా వస్తే మాత్రం ముప్పు తీవ్రత అధికంగా ఉంటోందని హెచ్చరించింది. ముఖ్యంగా 0-28 రోజుల్లోపు నవజాత శిశువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారిలో మరణ ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. చిన్నారుల్లో సాధారణ జలుబు, దగ్గు వంటివి తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించడం లేదు. అందుకే తల్లిదండ్రులలు కరోనా పరీక్షలు చేయించడం లేదని..ఈ కారణం వల్లే పిల్లల్లో కోవిడ్ కేసుల సంఖ్య స్పల్పంగా ఉంటోందని తెలిపింది.

పెద్దవారితో పోల్చితే.. 9 ఏళ్ల లోపు చిన్నారుల ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇక, 5 ఏళ్ల లోపు వయసు వారికి మాస్కు అక్కర్లేదనీ వెల్లడించింది. అంతకు పైబడిన వయసు వారికి మాస్క్ తప్పనిసరని స్పష్టం చేసింది. పిల్లలలో ఉన్న శరీర రోగ నిరోధక వ్యవ్యస్థ బలంగా ఉంటే, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నిజానికి మనం ఇచ్చే ఆహార పదార్థాలలో వారికి సరిపోయే పోషకాహారాలు ఉండవు. కావున కింద పేర్కొన్న ఔషదాలను వాళ్లు నే ఆహార పదార్థాల కలపటం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలంగా చేయవచ్చు.

అయినప్పటికీ, తాజా నివేదిక.. నిర్లక్ష్యం మాటున ప్రయాణిస్తున్న ప్రజలకు అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తోంది. పెద్దల విషయంలోనే కాదు… పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరిచూసుకొమ్మని హెచ్చరిస్తోంది.

Read Also…  US Corona Cases: అమెరికాలో మళ్లీ కరోనా కలవరం.. నిత్యం 2 వేలకు తగ్గని కోవిడ్ మరణాలు.. పిల్లల్లో పెరుగుతున్న కేసులు

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో సెంచరీతో షాక్
వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో సెంచరీతో షాక్
వీళ్లు కొడుకులు కారు యమకింకరులు..
వీళ్లు కొడుకులు కారు యమకింకరులు..
IPL 2025: క్రికెటర్ల జీతాల విధానం, చెల్లింపు ప్రక్రియ వివరాలు
IPL 2025: క్రికెటర్ల జీతాల విధానం, చెల్లింపు ప్రక్రియ వివరాలు
నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?
నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?
క్రిస్మస్ నెలలో సినిమాల సందడి.. డిసెంబర్‎లో రానుంది ఎవరు.?
క్రిస్మస్ నెలలో సినిమాల సందడి.. డిసెంబర్‎లో రానుంది ఎవరు.?
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. వదలరు
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. వదలరు
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ
డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు
డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు
ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తుందో తెల్సా
ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తుందో తెల్సా
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..