AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి స్త్రీవలన ఆకస్మిక ధనం కలుగుతుంది.. ఏ రాశివారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుందంటే..

Horoscope Today (september 20th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి స్త్రీవలన ఆకస్మిక ధనం కలుగుతుంది.. ఏ రాశివారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుందంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Sep 20, 2021 | 7:36 AM

Share

Horoscope Today (september 20th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 20వ తేదీ) ఏ రాశివారికి ఏ విధంగా ఉండనున్నదో  తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభవార్త వింటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అనారోగ్య బారినపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల విషయం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది.  పనులు ఆలస్యంగా అవుతాయి.

మిధున రాశి: ఈరాశి వారికి  విద్యార్థులకు అనుకూలంగా ఉంది.  కుటుంబం కలహాలు , ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని విషయాలు అనుకూలంగా జరుగుతాయి.  స్త్రీ వలన ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతికూల అంశాలు ఏర్పడే అవకాశం ఉంది.  ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు చేపట్టిన పనుల్లో అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి.  బంధు మిత్రుల్లో గౌరవం పెరుగుతుంది.  పిల్లల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స‌మాజంలో మంచిపేరు సంపాదిస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఆదాయంపొందే అవకాశం ఉంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.  కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి . విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌కార్య ప్రయ‌త్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి శత్రు బాధ‌లు తొలగిపోతాయి.  ముఖ్యమైన వ్యక్తుల్ని క‌లుస్తారు, ఆక‌స్మిక లాభాలుంటాయి.  శుభ‌కార్య ప్రయ‌త్నాలు  నెరవేరతాయి.  సూక్ష్మబుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు.

మకర రాశి: ఈ రాశి వారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బారిన పడతారు.  వృత్తిరీత్యా స్దాన చలనం ఉంటుంది.  స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో తగిన విధంగా అలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి: ఈరాశి వారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.  ప్రయాణాలలో వ్యయ ప్రయాసలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.  వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో వివాదం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.

Also Read:

Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం.. సిటీలో కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు