AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాబ్‌లో జస్ట్‌ ఆరున్నర కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు.. బిల్లు చూసి అతని గుండె గుభేల్.. లక్షల్లో

రాత్రి తాగింది ఇంకా దిగనే లేదు. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్‌లోనే ఫోన్ లాక్ ఓపెన్ చేశాడు. కనిపించిన మెసేజ్ చూసి.. అతని దిమ్మతిరిగిపోయింది.

క్యాబ్‌లో జస్ట్‌ ఆరున్నర కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు.. బిల్లు చూసి అతని గుండె గుభేల్.. లక్షల్లో
Taxi
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2022 | 5:51 PM

Share

ఆరున్నర కిలోమీటర్ల దూరం.. ప్రయాణించిన సమయం 15 నిమిషాలు.. అందుకు క్యాబ్ నిర్వహణ సంస్థ వేసిన బిల్లు ఏకంగా రూ.32 లక్షలు. ఏంటి ఈ వార్త విని మీరు షాకవుతున్నారా..? పాపం ఇంక ఆ కస్టమర్ సంగతి ఊహించుకోండి. అతనికి తలతిరిగి కిందపడినంత పనయ్యింది. కాసేపటి తర్వాత తేరుకుని.. కస్టమర్‌ కేర్‌కి కాల్ చేయడంతో అసలు విషయం రివీలయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌‌లో ఉండే.. లివర్‌ కప్లాన్‌ తన ఫ్రెండ్స్‌ను కలిసేందుకు పబ్‌కు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు.  ఆరున్నర కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో రీచ్ అయ్యాడు. బుక్ చేసినప్పుడు అతనికి నార్మల్ ఛార్జీనే కనిపించింది. తెల్లారి మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేయగానే కనిపించిన మెసేజ్‌ అతడ్ని షాక్‌కు గురిచేసింది.

‘క్యాబ్‌ రైడ్ వినియోగించుకున్న మీకు 35,427 పౌండ్‌ స్టెర్లింగ్‌లు ఛార్జీ అయింది. మీ కార్డులో తగినంత మొత్తం లేనందన.. ఆ నగదు తీసుకోలేకపోతున్నాం’ అని రాసి ఉంది. దీంతో వెంటనే  క్యాబ్‌ సంస్థను సంప్రదించాడు లివర్‌ కప్లాన్‌. వారు వెరిఫై చేయగా మిస్టేక్ ఎక్కగా జరిగిందో తెలిసిపోయింది. డ్రాప్‌ ఆఫ్‌ లోకేషన్‌ ఛేంజ్ అవ్వడం వల్ల.. బిల్లు మొత్తం మారిపోయింది. మాంచెస్టర్‌లోని ‘విచ్‌వుడ్‌ పబ్‌’కు టూ అడ్రస్ పెడితే.. అది ఆస్ట్రేలియా విక్టోరియాలోని ‘విచ్‌వుడ్ పార్కు’గా మారిపోయింది. దీంతో బిల్లు తడిసి మోపెడయ్యింది. టెక్కికల్ ఇష్యూ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని సంస్థ ఇంజనీర్లు తెలిపారు. వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు.

తన అకౌంట్లో అంత మనీ లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ డబ్బు కట్ అయి ఉంటే.. సమస్య పరిష్కారం కోసం వారి చుట్టు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని లివర్‌ కప్లాన్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. అంత భారీ మొత్తం బిల్లు చూసి ఒక అరగంట చాలా టెన్షన్ పడ్డట్లు చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ