Lord Shani Dev: ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

Lord Shani: ఈ నెల(డిసెంబర్) 27 నుంచి శనీశ్వరుడు కుంభ రాశిలో గురువుకు చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం ప్రారంభించాడు. దీని వాళ్ల ఇంత కాలంగా శని దోషంతో అవస్థలు పడుతున్న రాశుల వారికి ఈ దోషం దాదాపు తొలగిపోయినట్టయింది. మార్చి 29న మీన రాశిలో ప్రవేశించబోతున్న శనితో కొన్ని రాశుల వారికి శని దోషాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

Lord Shani Dev: ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
Lord Shani Dev
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 29, 2024 | 10:17 PM

ఈ నెల 27 నుంచి శనీశ్వరుడు కుంభ రాశిలో గురువుకు చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల ఇంత కాలంగా శని దోషంతో అవస్థలు పడుతున్న రాశుల వారికి ఈ దోషం దాదాపు పూర్తిగా తొలగిపోయినట్టయింది. మార్చి 29న మీన రాశిలో ప్రవేశించబోతున్న శని ఇక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులను పూర్తిగా విడిచిపెట్టేయడం జరిగింది. ఈ రాశుల వారు వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయడం, శివార్చన చేయించడం వల్ల మేలైన ఫలితాలు పొందడం జరుగుతుంది.

  1. వృషభం: రెండున్నర ఏళ్ల నుంచి ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండడం జరుగుతోంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిం చకపోవడం, ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరగకపోవడం జరుగుతోంది. ఇక నుంచి ఈ రాశి వారి జీవితం మారబోతోంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి భాగ్యాధిపతిగా భాగ్య స్థానంలోనే సంచారం చేస్తున్నప్పటికీ ఆశించిన పురోగతి లభించే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఆదాయం పెరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ క్రమంగా పరి ష్కారమై ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది. విదేశీయానానికి, విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన గురువుకు సంబంధించిన పూర్వాభాద్ర నక్షత్రంలో శని ప్రవేశించ డంతో అనేక కష్టనష్టాల నుంచి ఈ రాశివారు క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఎదుగూ బొదుగూ లేని జీవితం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వది బలేసుకున్న సొమ్ముతప్పకుండా చేతికి అందుతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
  4. సింహం: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఆగిపోవడం జరిగింది. శుభకార్యాలకు ఆటంకాలు, విఘ్నాలు తలెత్తడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. శని పూర్వాభాద్ర నక్షత్ర ప్రవేశంతో ఈ బాధలన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నుంచి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఊహించని ధన యోగాలు పడతాయి.
  5. వృశ్చికం: ఈ రాశివారికి ఇంత కాలంగా సాగుతున్న అర్ధాష్టమ శని వల్ల అనేక పనులు మధ్యలోనే ఆగిపో వడం, రావలసినడబ్బు రాకపోవడం, కుటుంబ సమస్యలు, కుటుంబంలో శుభకార్యాలు జరగక పోవడం వంటివి జీవితంలో చోటుచేసుకుని ఉంటాయి. ఇక నుంచి ఈ కష్టనష్టాల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవడం, ఆదాయ వృద్ధి స్తంభించిపోవడం, ఆర్థిక సమస్యలు పేరుకుపోవడం, ప్రతి విషయంలోనూ వివాదాలు చుట్టుముట్టడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక వీటన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..