Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (January 1, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా, సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 01st January 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 01, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 1, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా, సానుకూలంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి లోటుండక పోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ప్రయాణాలు సానుకూలంగా, లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో కొద్దిగా శ్రమ, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. ఆదాయం బాగా అనుకూ లంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. లాభాలకు, రాబడికి లోటుండదు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పదోన్నతికి, బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కానీ, పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబం ధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో గౌరవాభిమానాలు బాగా వృద్ధి చెందుతాయి. అధికారులు మీ సమర్థతను గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శి స్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం మంచిది కాదు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు మీ మీద నమ్మకం పెడతారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గ డానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద బాగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సఫలమవుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ విస్తరిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభి స్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు అందుతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అలవి కాని లక్ష్యాలతో అవస్థలు పడే అవ కాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. కొందరు మిత్రుల కార్యకలాపాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆదాయపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?