Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (December 30, 2024): మేష రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. మిథున రాశి వారు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 30th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 30, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 30, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృషభ రాశి వారికి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. అయితే ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. మిథున రాశి వారు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు చాలావరకు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సమ ర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో యాక్టివిటి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం బాగా అనుకూ లంగా ఉంటుంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. మిత్రుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబపరంగా బాధ్య తలు పెరిగే సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆస్తి వివాదంలో కూడా ఆచి తూచి అడుగులు వేయడం మంచిది. ఆదాయం పరవాలేదు కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగ పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, వి‌శాఖ 1,2,3)

కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా సహనంతో వ్యవహరించడం మంచిది. ఇతరత్రా రోజంతా ప్రశాంతంగా, హ్యాపీగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలకు, లావాదేవీలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను, సమర్థతను గుర్తి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో జీవిత భాగ స్వామి సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవ హారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. మిత్రులతో లావాదేవీల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ. పెళ్లి ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు, బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగంలోనూ, వృత్తి జీవితంలోనూ ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి పెరగడం జరుగు తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ శాంతులకు లోటుండదు. ఒకరిద్దరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాల మీద శ్రమ పెరుగు తుంది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడు తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బును అతి కష్టం మీద వసూలు చేసు కుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. ఉద్యోగం మారే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహా రాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆర్థిక విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుకుంటారు. చదువులకు సంబంధించి పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!