AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా…? కారణం ఇదేనట..! ఇలా మాన్పించండి..

అంతేకాదు.. బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి వేలు సన్నగా పేలగా మారుతుంది. దీని ప్రభావం వారి చదువుపైకూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న పిల్లలు బలహీనంగా, అలసత్వ ధోరణి కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగని పిల్లలకు ఉన్న ఈ అలవాటును మాన్పించేందుకు కొందరు తల్లిదండ్రులు.. చిన్నారుల చేతికి కలబంద రసం, వేప ఆకుల రసం, కాకరరసం, మిర్చి లాంటివి పెడుతుంటారు. ఇలా చేయటం సరికాదంటున్నారు వైద్యులు.

పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా...? కారణం ఇదేనట..! ఇలా మాన్పించండి..
Thumb Sucking Habit
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2024 | 6:12 PM

Share

పిల్లలు తమ బొటన వేలిని నోట్లో పెట్టుకోవడం సర్వ సాధారణం. ఈ అలవాటు చాలా మంది పిల్లలకు ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న వయస్సులో అంటే 4 నుండి 5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలను ఈ అలవాటు నుండి ఆపడానికి ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే పదే పదే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల దంతాల నిర్మాణం సమస్యలు తలెత్తుతాయి. ముఖం ఆకారం కూడా మారే అవకాశం ఉంది. ఈ అలవాటు వల్ల నోటిలోకి బ్యాక్టీరియా చేరి వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోకుండా వారి అలవాటు మానేయించాలి. పిల్లల్లో ఈ అలవాటు వెనుక కారణం కూడా వైద్యులు వెల్లడించారు. పిల్లలు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు.. కానీ, తల్లిదండ్రులు దీనిని చాలా సాధారణ విషయంగా భావిస్తారు. ఇలా చేస్తే అది మీ చిన్నారికి ఎంత నష్టం చేస్తుందో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుంటే వారికి ఆకలివేయకుండా ఉంటుంది. దాంతో పిల్లలు పాలు కానీ, భోజనం కాని అడగరు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. అలాగే, పిల్లలు ఆడుకునే క్రమంలో చేతుల్లో మురికితోబాటు దుమ్ము, క్రిమి-కీటకాలు చేరుతుంటాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవటం వల్ల మురికి వాడి చేతి ద్వారా నోట్లోకి చేరుకుంటాయి. వారు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉంది అంటున్నారు ప్రముఖ వైద్యులు. పిల్లలు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడంవలన వారి పళ్ల వరుస కూడా దెబ్బతింటుంది. దంతాలు బయటికి చొచ్చుకు వస్తాయి. పెదాలు కూడా లావుగా మారే అవకాశం ఉంది.

అంతేకాదు.. బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి వేలు సన్నగా పేలగా మారుతుంది. దీని ప్రభావం వారి చదువుపైకూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న పిల్లలు బలహీనంగా, అలసత్వ ధోరణి కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగని పిల్లలకు ఉన్న ఈ అలవాటును మాన్పించేందుకు కొందరు తల్లిదండ్రులు.. చిన్నారుల చేతికి కలబంద రసం, వేప ఆకుల రసం, కాకరరసం, మిర్చి లాంటివి పెడుతుంటారు. ఇలా చేయటం సరికాదంటున్నారు వైద్యులు. ఇలా చేస్తే పిల్లలను ఒకేసారి ఆందోళనకు గుర్తుచేస్తాయని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ అలవాటు మాన్పించలేరు. ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఓపిక అవసరం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..