AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: బీరు తాగే వారికి దోమలు ఎక్కువగా కుడుతాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..

దోమ కాటు ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మనిషిని కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా చేరు వేసే సంఘటనలు ఉన్నాయి. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాయిల్స్‌ మొదలు లిక్విడ్స్‌ వరకు దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగిస్తుంటారు....

Alcohol: బీరు తాగే వారికి దోమలు ఎక్కువగా కుడుతాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Mosquitoes
Narender Vaitla
|

Updated on: Jul 17, 2024 | 6:18 PM

Share

దోమ కాటు ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మనిషిని కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా చేరు వేసే సంఘటనలు ఉన్నాయి. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాయిల్స్‌ మొదలు లిక్విడ్స్‌ వరకు దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగిస్తుంటారు.

అయితే దోమకాటులో కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా.? డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తే దోమలను ఎవరిని పడితే వారికి కుట్టవు. ఒక దోమ మనల్ని కుడుతుంది అంటే అందుకు ఒక రిజన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీరు సేవించే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ ఖుబ్‌చందానీ ఈ విషయమై మాట్లాడుతూ.. దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు. ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్‌ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఓ బ్లెడ్‌ గ్రూప్‌ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి. అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే..
నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే..
చికెన్, మటన్ కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూరగాయ..
చికెన్, మటన్ కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూరగాయ..
ఇదేందిది.! టీ20ల్లో ధోని అత్యంత చెత్త రికార్డు ఇదేనా..
ఇదేందిది.! టీ20ల్లో ధోని అత్యంత చెత్త రికార్డు ఇదేనా..
బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం ఇక ఈజీ.. ప్రభుత్వం నుంచి అప్డేట్
బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం ఇక ఈజీ.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఈ డ్రింక్స్ తో షుగర్ ను కంట్రోల్ చేసేయండి..
ఈ డ్రింక్స్ తో షుగర్ ను కంట్రోల్ చేసేయండి..
కాకర జ్యూస్.. యూరిక్ యాసిడ్, డయాబెటిస్‌కు దివ్యౌషధం
కాకర జ్యూస్.. యూరిక్ యాసిడ్, డయాబెటిస్‌కు దివ్యౌషధం
గోధుమ Vs జొన్న రోటీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది బెస్ట్!
గోధుమ Vs జొన్న రోటీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది బెస్ట్!
లిఫ్ట్‌ ఎక్కిన మహిళ.. సడెన్‌గా ఎంటరైన ముసుగు వ్యక్తి.. చివరకు..
లిఫ్ట్‌ ఎక్కిన మహిళ.. సడెన్‌గా ఎంటరైన ముసుగు వ్యక్తి.. చివరకు..
ఆధార్ కార్డులో కీలక అప్డేట్.. ఇకపై ఎక్కడినుంచైనా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో కీలక అప్డేట్.. ఇకపై ఎక్కడినుంచైనా మార్చుకోవచ్చు
గుండెపోటు వచ్చే 2 రోజుల ముందు కనిపించే లక్షణాలు ఇవే..
గుండెపోటు వచ్చే 2 రోజుల ముందు కనిపించే లక్షణాలు ఇవే..