AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానాకాలంలో ఇళ్లంతా ముక్కవాసన వస్తోందా..? ఇంట్లో సువాసన పెంచే సింపుల్ చిట్కాలు..

ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అంతేకాదు.. బయట ఎండలేకపోవడంతో బట్టలు ఆరవు.. ఇళ్లంతా పచ్చి పచ్చిగా ముతక వాసనగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వ్యాధులకు కారణం అవుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. అయితే, వర్షాకాలంలో ఇంటిని ఆరోగ్యంగా, సువాసన భరితంగా ఉంచేందుకు కొన్ని అద్భుత చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

వానాకాలంలో ఇళ్లంతా ముక్కవాసన వస్తోందా..? ఇంట్లో సువాసన పెంచే సింపుల్ చిట్కాలు..
Room Fresh
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2025 | 2:12 PM

Share

వర్షాకాలం ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా నిరంతరం తేమ కారణంగా అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. ఒక్కసారిగా సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అంతేకాదు.. బయట ఎండలేకపోవడంతో బట్టలు ఆరవు.. ఇళ్లంతా పచ్చి పచ్చిగా ముతక వాసనగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వ్యాధులకు కారణం అవుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. అయితే, వర్షాకాలంలో ఇంటిని ఆరోగ్యంగా, సువాసన భరితంగా ఉంచేందుకు కొన్ని అద్భుత చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

– చందనం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి ఇంట్లో చల్లుకోవాలి. ఇలా చందనం పొడి కలిపిన నీరు ఇంటికి మంచి సువాసనను తెస్తుంది. ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఇంటిల్లిపాది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

– లావెండర్ పువ్వులు ఇంటికి మంచి సువాసనని అందిస్తాయి. పైగా ఇవి ఇంట్లో ప్రశాంతతను కూడా పెంపొందిస్తాయి. గదిలో లావెండర్‌ పూలను పెట్టడం వల్ల తడివాసన పోయి, మంచి వాసన వెదజల్లుతుంది.

ఇవి కూడా చదవండి

– తులసి ఆకులు లేదా తులసి రసం కలిపిన నీళ్లను ఇంట్లో స్ప్రే చేయడం వల్ల తడి వాసన తగ్గుతుంది. ఇంట్లో తులసి పరిమళంతో మంచి వాసనగా ఉంటుంది.

– పుదీనా ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. ఇది కూడా మీ ఇంట్లోని ముతక వాసన, ముక్క వాసనను దూరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి సువాసన వస్తుంది.

-గులాబీ రేకులు మంచి తాజా వాసనను ఇస్తాయి. గులాబీ రేకులని ఇంట్లో పెడితే సువాసన వస్తుంది. చూసేందుకు కూడా ఇల్లు ఆకర్షణీయంగా కన్పిస్తుంది.

– యాలకులు గిన్నెలో పెట్టి ఇంట్లో ఒక మూల పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సువాసన ఉంటుంది. యాలకులను పొడి చేసి నీళ్లు కలిపి ఇళ్లంతా స్ప్రే చేసినా కూడా సరిపోతుంది.

– నిమ్మగడ్డి నూనెను ఇంట్లో స్ప్రే చేయటం వల్ల కూడా ఇళ్లంతా మంచి సువాసన వస్తుంది. ఇది మంచి సువాసన వచ్చేలా చూస్తుంది. నిమ్మగడ్డి నూనె వల్ల తడివాసన మొత్తం పోతుంది.

– వేప ఆకులు కూడా వర్షాకాలంలో అనేక విధాలుగా మేలు చేస్తాయి. వేప ఆకులతో పొగ వేస్తే ఇంట్లో సువాసన వస్తుంది. పైగా దోమలు, కీటకాలు వంటివి కూడా ఇంట్లోకి చేరవు.

– దాల్చిన చెక్క ముక్కలను నీళ్లలో వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా మంచి వాసన ఉంటుంది. తడి వాసన పోతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..