AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13ఏళ్ల కూతురి డెంటల్‌ ఎక్స్‌రే చూసి అంతా షాక్..! 6 నెలల క్రితం తల్లి మాట వినకుండా చేసిన పనితో…

తల్లిదండ్రులు వద్దన్న పనినే పిల్లలు ఎప్పుడూ చేస్తుంటారు. అలాంటి పనుల వల్ల వారితో పాటు అమ్మనాన్నలకు కూడా పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే మొండి పనులు వారి ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటాయి. సరిగ్గా అలాంటి పనినే చేసింది ఒక 13బాలిక. ఆమె తల్లి తనకు ముక్కు కుట్టించడం లేదని తానే కుట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ తరువాత జరిగింది తాను కూడా ఊహించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే...

13ఏళ్ల కూతురి డెంటల్‌ ఎక్స్‌రే చూసి అంతా షాక్..! 6 నెలల క్రితం తల్లి మాట వినకుండా చేసిన పనితో...
Dental Xray Surprise
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2025 | 8:37 AM

Share

నివేదిక ప్రకారం… అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో నివసిస్తున్న ఒక తల్లి తన 13 ఏళ్ల కుమార్తెను బ్రేసెస్ ప్రక్రియను ప్రారంభించడానికి ఆర్థోడాంటిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. అంతా సాధారణంగానే అనిపించింది. కానీ డాక్టర్ ఎక్స్-రేను స్క్రీన్‌పై ఉంచిన వెంటనే, అందరూ షాక్ అయ్యారు. ఆ అమ్మాయి సైనస్‌లో లోహపు ముక్క ఇరుక్కుపోయిందని ఆ ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించింది. అది చూడగానే తల్లికి ఏమీ అర్థం కాలేదు. కానీ, కూతురికి వెంటనే గుర్తుకు వచ్చింది.

దాదాపు ఆరు నెలల క్రితం ఆమె తన తల్లిని ముక్కు కుట్టించుకుంటానని పట్టుబట్టింది. కానీ తల్లి స్పష్టంగా నిరాకరించింది.16 ఏళ్లలోపు ముక్కు కుట్టించుకోబోమని చెప్పింది. అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి తన ముక్కును కుట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో లోహంలోని ఒక చిన్న భాగం ముక్కు లోపలికి వెళ్లి సైనస్‌లో చిక్కుకుంది. కానీ, అమ్మకు తెలిస్తే ఏమంటుందోననే భయం కారణంగా, ఆమె తన తల్లికి ఎప్పుడూ చెప్పలేదు. బహుశా ఆ ముక్క దానంతట అదే బయటకు వచ్చేసి ఉంటుందని, లేదా మింగేసి ఉంటానని నమ్మింది.

కానీ, ఈ రహస్యం ఎక్స్-రేలో బయటపడటంతో తల్లికి అసలు విషయం తెలిసింది. కాగా, 15 రోజుల క్రితం Scared_Category6311 అనే యూజర్ పేరుతో బాలిక తల్లి రెడ్డిట్‌లో ఈ పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో ఇలా రాశారు. నా కూతురు ముక్కును కుట్టుకోవడానికి ప్రయత్నించింది. అనుకోకుండా ముక్కుపోగు ముక్క లోపలికి వెళ్లిపోయింది. కానీ, ఆమె దాని గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ డెంటల్ ఎక్స్-రే తీసుకున్నప్పుడు ఇదంతా చూసి మేము షాక్ అయ్యాము. అయితే, డాక్టర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఫోర్సెప్స్‌తో ఆ ముక్కలో ఇరుక్కున్న ముక్కు పుడకను తొలగించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కు వార్త రాసే సమయానికి 73 వేలకు పైగా లైక్‌లు, 1.3 వేల వ్యాఖ్యలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వార్తపై స్పందించారు. కొందరు పిల్లలు ప్రతిదీ స్వయంగా చెప్పే విధంగా వ్యవహరించాలని అన్నారు. చాలా మంది వినియోగదారులు ఆమె ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. నెటిజన్లకు సమాధానంగా ఆమె తల్లి స్పందిస్తూ.. తన కూతురు పూర్తిగా బాగానే ఉందని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..