AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులస, ట్యూనా కాదు… మత్స్యకారులు అత్యంత ఇష్టంగా తినే చేపలు ఇవే..! ఇది పోషకాల నిధి..

సముద్రరొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను వేటాడి తింటాయి. ఇవి ఉష్ణ మండల ప్రాంత సముద్రాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ జెర్రీ చేపలు అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. ఆహారం కోసం రాత్రులు నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. అప్పుడు సులువుగా మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు. ఇకపోతే, డిమాండ్ ని బట్టి జెర్రీ చేప ధర ఉంటుంది. మాములుగా కిలో ధర రూ..

పులస, ట్యూనా కాదు... మత్స్యకారులు అత్యంత ఇష్టంగా తినే చేపలు ఇవే..! ఇది పోషకాల నిధి..
Jerry Chepa
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2025 | 8:21 AM

Share

పులస నుండి ట్యూనా వరకు మత్స్యకారులు ఎన్నో రకాల చేపలు పడుతుంటారు. మరి అన్ని చేపలు పట్టే మత్స్యకారులు అత్యంత ఇష్టంగా తినే టేస్టీ, హెల్దీ చేప ఏంటో మీకు తెలుసా? అదే జెర్రీ చేప. ఈ పోషకాల ఘని గురించి మీకోసం. ఇవి పొడవుగా, పెద్దగా ఉంటూ చిన్న చేపలను వేటాడి తింటాయి. ఈ చేప అత్యధిక పోషకాలతో పాటు అత్యంత రుచిగా కూడా ఉంటుంది. అందుకే చేపలు ఇష్టపడే వారు, మత్స్యకారులకు ఇష్టమైన చేపల్లో ఒకటిగా ఈ జెర్రీ చేపను పిలుస్తారు.

ఈ జెర్రీ చేప దంతాలు చాల పదునుగా ఉంటాయి. లేత తెలుపు రంగులో సన్నగా ఉండి పొడవాటి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఈ చేపకు కింద దవడ పొడవుగా ఉంటుంది. సూదిగా ఉండే నోటి భాగాన్ని కలిగి ఉంటుంది. దీంతో వేటాడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ చేపలు ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీర ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. సముద్రరొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను వేటాడి తింటాయి. ఇవి ఉష్ణ మండల ప్రాంత సముద్రాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ జెర్రీ చేపలు అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. ఆహారం కోసం రాత్రులు నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. అప్పుడు సులువుగా మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు.

ఇకపోతే, డిమాండ్ ని బట్టి జెర్రీ చేప ధర ఉంటుంది. మాములుగా కిలో 300 రూపాయిలు గా ఉంటుంది. డిమాండ్ బట్టి 400 రూపాయల వరకు పలుకుతుంది. దీని రుచి కారణంగా ధర చూడకుండా ప్రజలు కనుగోలు చేస్తున్నారు. ఈ జెర్రీ చేప రుచి తో పాటు అధిక పోషకాలు ఉంటాయి. దీనిలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం