AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబ్బులకు కారణం గ్రహాలేనా..? జాతకం ద్వారా వ్యాధులను తెలుసుకోవచ్చా..?

వైద్య జ్యోతిష్య శాస్త్రం అంటే జ్యోతిష్యం లో ఒక ప్రత్యేకమైన భాగం. ఇది గ్రహాలు, రాశులు, అలాగే మనం చేసిన కర్మల ఆధారంగా మనుషుల కు వచ్చే జబ్బుల కారణాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పూర్వ కాలంలో దీనిని ఋషులు, వైద్యులు ఉపయోగించేవారు.

జబ్బులకు కారణం గ్రహాలేనా..? జాతకం ద్వారా వ్యాధులను తెలుసుకోవచ్చా..?
Medical Astrology
Prashanthi V
|

Updated on: Aug 19, 2025 | 2:04 PM

Share

పురాణాల ప్రకారం.. మనం చేసే కర్మలు మూడు రకాలు. గతంలో చేసిన కర్మల వల్ల ఇప్పుడు మనకు జబ్బులు, కష్టాలు, బాధలు వస్తాయని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ద్వారా మన గత కర్మల ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అందుకే పూర్వ కాలంలో వైద్యులు ఒక మనిషికి జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి వారి జాతకాన్ని చూసేవారు.

జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎలా తెలుసుకోవాలి..?

జ్యోతిష్యంలో ఒక వ్యక్తి భవిష్యత్తు, ఆరోగ్యం, కష్టసుఖాలను తెలుసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి

  • జన్మ జాతకం.. పుట్టినప్పుడు గ్రహాల స్థానాల ఆధారంగా జాతకం.
  • వర్షఫల జాతకం.. ఒక సంవత్సరంలో జరగబోయే విషయాలు.
  • ప్రశ్న జాతకం.. అడిగిన ప్రశ్నకు జవాబు కోసం.
  • సంచార ఫలితాలు.. గ్రహాల కదలికల వల్ల కలిగే మార్పులు.
  • సముద్రిక శాస్త్రం.. చేతులు, శరీర భాగాల ఆధారంగా భవిష్యత్తును చెప్పడం.
  • వైద్య జ్యోతిషంలో ఈ పద్ధతులు ఉపయోగించి జబ్బు లక్షణాలను అంచనా వేయడంతో పాటు.. పరిష్కార మార్గాలను కూడా సూచిస్తారు.

వైద్య జ్యోతిషశాస్త్రం చరిత్ర

పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలలో వైద్య జ్యోతిషశాస్త్రం గురించి చాలా విషయాలు ఉన్నాయి. పాత రోజుల్లో వైద్యులు గ్రహాల స్థానాలను చూసి రోగి వయస్సు, జబ్బు ఎంత తీవ్రంగా ఉందో ముందుగానే చెప్పేవారు. అయితే కొన్ని విపత్తుల వల్ల ఈ విషయాలకు సంబంధించిన చాలా గ్రంథాలు చెదిరిపోయాయి.

ఈ రోజుల్లో కూడా వైద్య జ్యోతిషశాస్త్రంపై ఇంకా ఎక్కువ పరిశోధనలు జరగాలి. ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్యంతో పాటు జ్యోతిష్యాన్ని కూడా కలిపి చూడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వల్ల చాలా మంది తమ జాతకం ఆధారంగా జబ్బులకు మూల కారణాలు తెలుసుకుని.. మానసికంగా ధైర్యం పొందుతున్నారు.

ఒక మనిషికి వచ్చే జబ్బులు కేవలం శారీరక కారణాల వల్ల మాత్రమే కాకుండా.. కర్మల ప్రభావం వల్ల కూడా వస్తాయని వైద్య జ్యోతిషశాస్త్రం చెబుతుంది. మన కర్మలే మన భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ఇది కేవలం జ్యోతిషశాస్త్రం మాత్రమే కాదు.. జీవితానికి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించేది కూడా.

(Note: ఈ సమాచారం సంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్రం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇది కేవలం అవగాహన కోసం ఉద్దేశించినది. దయచేసి దీన్ని వైద్యపరమైన సలహాగా లేదా శాస్త్రీయ నిర్ధారణగా పరిగణించవద్దు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం మంచిది.)