మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతాన్ని పులి సంచారం వణికిస్తోంది. ఆడ తోడును వెతుకుతూ అభయారణ్యం వీడి పట్టణ ప్రాంతాలకు సమీపంలో సంచరిస్తున్న బెబ్బులి, మందమర్రి, శ్రీరాంపూర్ గనుల కార్మికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. అటవీ శాఖ నిఘా పెంచి, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.