Food habits: చప్పుడు చేస్తూ తినాలి.. తింటూ ఉప్పు తక్కువ అంటే తింటున్నవారికి మర్యాద లేనట్టే.. ప్రపంచంలో వింత పద్ధతులు!
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఒక్క మెతుకు మిగలకుండా తినాలని మన దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు చెబుతారు. అయితే, చైనాలో ఎవరి ఇంటికైనా వెళ్లి అలా కంచంలో ఏమీ మిగలకుండా తినేస్తే వాళ్ళు అవమానంగా భావిస్తారు.
Food habits: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఒక్క మెతుకు మిగలకుండా తినాలని మన దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు చెబుతారు. అయితే, చైనాలో ఎవరి ఇంటికైనా వెళ్లి అలా కంచంలో ఏమీ మిగలకుండా తినేస్తే వాళ్ళు అవమానంగా భావిస్తారు. ఎందుకంటే, వారి దృష్టిలో అది తమ అతిథులకు రుచికరమైన భోజనం పెట్టలేకపోయామని సంకేతం. అలాగే భోజనం చేసే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒక్కో దేశంలో మంచి అనుకునే పధ్ధతి మరో దేశంలో వారికి అమర్యాదగా అనిపిస్తుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన కొన్ని ఆహారపు అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దయచేసి కుడి చేయి మాత్రమే!
మధ్యప్రాచ్యంలో (ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యెమెన్, సిరియా, కువైట్ మొదలైనవి) ఎడమ చేతితో తినడం అనారోగ్యకరమైన అలవాటుగా పరిగనిస్తారు. కుడి చేయి మాత్రమే తినడానికి ఉపయోగించడం మర్యాదగా భావిస్తారు. మనదేశంలో కూడా కుడిచేత్తో మాత్రమే తినడం మర్యాదగా చెబుతారనేది తెలిసిందే.
ఫోర్క్ తో తినవద్దు..
థాయ్‌లాండ్‌లో ఫోర్క్‌తో ఆహారాన్ని నోటిలో పెట్టుకోవడం హేయమైన చర్య. ఇది ఆహారం పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. ఫోర్క్ ఆహారాన్ని చెంచాకు బదిలీ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. అక్కడ ఫోర్క్ తో ఏదైనా ఆహార పదార్ధాన్ని నోటిలో పెట్టుకోవడాన్ని చూస్తే అలా చేసిన వారిపట్ల వారి గౌరవం పోతుంది.
అరవండి!
తినేటప్పుడు.. త్రాగేటప్పుడు శబ్దం చేయడం చెడు ధోరణి అని మనం అనుకుంటాం. కానీ,జపాన్‌లో ఇది చాలా మంచి విషయం. ఆహ్లాదకరమైన ధ్వని చేస్తూ నూడుల్స్, సూప్‌లు తినడం ఆహారం చాలా రుచిగా ఉంటుందని చెప్పడంగా జపనీయులు భావిస్తారు.
పెద్దలు ముందు!
దక్షిణ కొరియాలో, సమూహంలోని అతి పెద్ద వ్యక్తి బహుళ భోజనంలో తినడం ప్రారంభించిన మొదటి వ్యక్తి కావాలి. ఆయన తినడం ప్రారంభించిన తరువాతే మిగతావాళ్ళు తినడం మొదలుపెడతారు. పెద్దల పట్ల గౌరవ సూచకంగా ఇలా చేస్తారు. ఎటువంటి సందర్భంలోనూ పెద్దలు భోజనం చేయడం మొదలు పెట్టకుండా అక్కడ ఎవరూ భోజనానికి ఉపక్రమించరు.
చాప్ స్టిక్‌లు సులభం కాదు..
చైనాలో డైనింగ్ టేబుల్‌లలో చాప్ స్టిక్‌లు ప్రధానమైనవి. కానీ చాప్ స్టిక్‌లు చాలా సులభంగా ఉపయోగించవచ్చని అనుకోకండి. నిటారుగా వాటిని పట్టుకుని తినాలి. పొరపాటున కూడా వేరొకరికి ఎదురుగా ఉండే ఆహార కంటైనర్‌లో చాప్‌స్టిక్‌లను ఉంచకుండా జాగ్రత్త వహించాలి. ఎవరి చాప్ స్టిక్‌లు వారి ఆహార కంటైనర్ లలోనే ఉండాలి.
టీకప్‌లోని పద్ధతులు
బ్రిటిష్ వారికి టీ అంటే చాలా ఇష్టం. అయితే బిటిష్ వారికీ ఒక కప్పు టీ తాగడంలో కొన్ని నియమాలు ఉంటాయి. అవి తెలుసుకుందాం. కప్పులో చక్కర వేసి టీని కదిలించేటప్పుడు చెంచా కప్పుకు ఎటువంటి పరిస్థితిలోనూ తాకవద్దు. కదిలించిన తర్వాత, చెంచా తీసుకొని సాసర్‌లో ఉంచాలి. ఇలా చేయకపోతే మనకు మంచి అలవాట్లు లేవని వారు భావిస్తారు.
తాకవద్దు..
చిలీలో, ఏ ఆహారం తీసుకున్నా చేతితో తినడం మంచిది కాదని ఒక నమ్మకం ఉంది. వారు చెంచా లేదా ఫోర్క్ లేదా కత్తితో తింటారు.
ఉప్పు కారాలు!
మనం ఇంట్లో కూరలో ఉప్పు, కారం తక్కువగా ఉంటె అడిగి వాటిని మళ్ళీ వేసుకుని కలుపుకుని తింటాం. మీరు ఎప్పుడైనా ఇదే పని ఈజిప్టు, పోర్చుగల్ దేశాలలో చేశారనుకోండి.. మిమ్మల్ని ఎగాదిగా చూసి కల్చర్ లెస్ ఫెలో అనేస్తారు. ఎందుకంటే, అక్కడ ఒకసారి వండిన ఆహారంలో ఉప్పు లేదా కారం వేయమని మళ్లీ అడగడం ఆహారాన్ని తయారు చేసిన వ్యక్తికి అగౌరవంగా పరిగణిస్తారు.
చూశారుగా ఇవి కొన్ని దేశాల్లో ఉన్న ఆసక్తికరమైన కొన్ని ఆహారపు అలవాట్లు. మిగిలిన దేశాల్లోనూ ఇలానే చాలా అలవాట్లు ఉంటాయి. మన అలవాట్లు కొన్ని దేశాల్లో ప్రజలకు అగౌరవంగా అనిపించవచ్చు. వారి అలవాట్లు మనకు చిరాకుగా అనిపించవచ్చు. కానీ, ఎవరి అలవాటు వారిదే కదా.
ఇవి కూడా చదవండి: Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!
Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!
JioPhone Next: జియో ఫోన్ నెక్స్ట్ బ్యాటరీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?