Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ప్రోటిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి..
Weight Loss - Protein Rich Breakfast: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. ఎలాగైన బరువు తగ్గాలన్న పట్టుదలతో పలు రకాల

Weight Loss – Protein Rich Breakfast: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. ఎలాగైన బరువు తగ్గాలన్న పట్టుదలతో పలు రకాల డైట్లు పాటించడం, వ్యాయమం చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే.. ముఖ్యంగా బరువు తగ్గడం విషయానికి వస్తే.. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమంగా తినాలన్న విషయం అందరికీ తెలుసిందే. ప్రోటీన్ ఆహారం శరీరంలో కణాల అభివృద్ధికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ప్రోటీన్ ఆహారం ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. నిరసం లక్షణాలను దూరం చేసి.. అనారోగ్యం బారిన పడకుండా అండగా నిలుస్తుంది. దీంతోపాటు శరీర కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. అయితే.. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా.. దీర్ఘకాలిక ఫలితాలను చూడాలనుకుంటే.. శరీర బరువు (శారీరక శ్రమ స్థాయిని బట్టి) కు అనుగుణంగా ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిలోకు 1.5 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. అయితే.. బ్రేక్ ఫాస్ట్‌తోనే ప్రోటిన్ ఆహారం తీసుకోవడం మొదలుపెడితే.. ఎక్కువ ఫలితం ఉంటుంది. కావున ప్రోటీన్-రిచ్ అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం వలన మధ్యాహ్నం వరకు పొట్ట నిండుగా ఉంటుంది. దీంతోపాటు జీవక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కావున మీరు బరువు తగ్గేందుకు ప్లాన్ చేస్తుంటే.. ఉదయాన్నే అధిక ప్రోటీన్ ఉండే ఐదు రకాల ఆహారపదార్థాలను అల్పాహారం నుంచి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గుడ్లు ఉడికించిన లేదా వేయించిన గుడ్లను తినవచ్చు. అల్పాహారంలో ఆమ్లెట్, ఉడికించిన గుడ్లను తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. కావున అల్పాహారంలో చేర్చుకోవడం మంచిది. విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు గుడ్లల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు తృణధాన్యాలు, పచ్చి కూరగాయలు తినడం ఇంకా ఉత్తమం.
వోట్మీల్.. వోట్మీల్ కూడా మంచి ప్రోటిన్ ఆహారం.. ఒక చెంచా నట్ బటర్, కొన్ని తాజా పండ్లు, డ్రై ఫ్రూట్‌లతో కూడిన వేడి వోట్మీల్‌ను అల్పాహారంలో తీసుకుంటే చాలా మంచిది. వోట్మీల్‌లో ప్రోటీన్, ఫైబర్, రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శీతాకాలంలో జలుబు, దగ్గు నుంచి రక్షిస్తాయి.
చియా సీడ్స్.. చియా గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట చియా గింజలతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లను అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గేలా చేయడంతోపాటు ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కొన్ని గింజలను రాత్రి పాలలో నాన బెట్టి.. ఉదయాన్నే వేడి చేసుకొని తీసుకోవచ్చు. చియా విత్తనాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో మేలు చేస్తాయి.
పెసర పెసర పప్పులో విటమిన్లు ఎ, బి, సి, డి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం లాంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పెసరట్టు తినడం మంచిది.
పోహా(అటుకులు) పోహాను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం మంచిది. పోహాలో కొన్ని వేరుశెనగలను వేసి కాస్త వేయించుకోని ఉదయాన్నే తింటే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు లభిస్తాయి. ఇంకా పోహాలో కొన్ని బఠానీలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కాలీఫ్లవర్ లాంటివి కూడా జోడించి తినవచ్చు. ఆకలిని తగ్గించడానికి పోహాను స్నాక్‌గా తింటే.. బరువు సులభంగా తగ్గొచ్చు.
Also Read:




