Lottery News: అదృష్టం అంటే ఇదే..లక్కీ లాటరీ టికెట్! అమ్మకం కాకుండా మిగిలిపోయింది.. లక్షలు తీసుకువచ్చింది..
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. అందులోనూ దీపావళి పండగ.. లక్ష్మీదేవిని అతని ఇంటికి తీసుకువచ్చింది. లాటరీ టికెట్లు అమ్ముకుని కడుపు నింపుకునే ఆ సామాన్యుడిని అమ్మకుండా మిగిలిపోయిన లాటరీ టికెట్ లక్షాధికారిని చేసేసింది.
Lottery News: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. అందులోనూ దీపావళి పండగ.. లక్ష్మీదేవిని అతని ఇంటికి తీసుకువచ్చింది. లాటరీ టికెట్లు అమ్ముకుని కడుపు నింపుకునే ఆ సామాన్యుడిని అమ్మకుండా మిగిలిపోయిన లాటరీ టికెట్ లక్షాధికారిని చేసేసింది. కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లాటరీ టికెట్లు అమ్ముకుంటేనే కానీ రోజు గడవని సాజిమోన్ అనే వ్యక్తి.. దీపావళి కొన్ని లాటరీ టికెట్లు అమ్మకుండా మిగిలిపోవడంతో నిరాశ చెందాడు. కానీ.. ఆ టికెట్లలో ఇక టికెట్ కు లాటరీ తగిలింది. దీంతో అతని దశ తిరిగింది. దీపావళి సందర్భంగా, మిగిలిపోయిన ఐదు కారుణ్య ప్లస్ లాటరీ టికెట్లలో ఒకదానికి మొదటి బహుమతి రూ. 80 లక్షలు అదేవిధంగా మిగిలిన నాలుగు టిక్కెట్‌లకు ఒక్కోదానికీ 8000 రూపాయలు బహుమతిని గెలుచుకున్నాడు.
ఆరోగ్యం బాగోక అప్పుల పాలై..
కేరళ రాష్ట్రంలోని తిరువంచూర్‌కు చెందిన కెజె సాజిమోన్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయడంతో గతంలో చేసిన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత లాటరీ టిక్కెట్లు అమ్మడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం డబ్బు అందక అప్పుల పాలయ్యాడు. అతను గత 8 సంవత్సరాలుగా అన్ని రోజులలో ఉదయం ఏడు గంటలకు తన సైకిల్‌పై లాటరీ టికెట్లతో బయలుదేరుతాడు. కిలోమీటర్లు సైకిల్ తొక్కినా ఫర్వాలేదు, తన లాటరీ టికెట్లన్నీ అమ్మిన తరువాతే ఇంటికి చేరతాడు. అదే లక్ష్యంతో ప్రతిరోజూ పని చేస్తూ వస్తున్నాడు సాజిమోన్. రోజూలానే ఈ దీపావళికి అన్ని టిక్కెట్లను విక్రయించడానికి అతను విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే, ఆ రోజు 5 టిక్కెట్లు అమ్ముడుపోలేదు. అయితే ఈ టిక్కెట్లు అతని జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి.
‘‘ఆర్థిక ఇబ్బందుల వల్ల 20 ఏళ్ల క్రితం కట్టిన ఇంట్లో స్టవ్ కూడా పెట్టలేకపోయాను. నేను కొత్త బావిని నిర్మించాలి. నా ఇంటిని పునరుద్ధరించాలి. నా పిల్లలకు సహాయం చేయాలి.”అని సాజిమోన్ చెప్పారు. అతని కుటుంబంలో భార్య లీలమ్మ, కూతురు స్నేహ, కుమారుడు సుజేష్ ఉన్నారు. సాజిమోన్ తిరువంచూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో బహుమతి గెలుచుకున్న టిక్కెట్‌ను సరెండర్ చేశారు.
ఇవి కూడా చదవండి: Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!
Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!
JioPhone Next: జియో ఫోన్ నెక్స్ట్ బ్యాటరీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?