Gold Imports: అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు.. ఏకంగా ఎన్ని టన్నులంటే..?
నవంబర్‌లో రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 61,914 రూపాయలకు చేరుకుంది. అయితే దీపావళి సందర్భంగా డిమాండ్ బలంగా ఉందని పూణే నగరంలోని జ్యువెలర్ పిఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ సిఇఒ అమిత్ మోదక్ తెలిపారు. ప్రజలు బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి ఉత్పత్తిగా భావించడం వల్ల నాణేలు, బార్‌లకు బలమైన డిమాండ్ ఉందని, ఇది కొనుగోళ్లను పెంచడానికి దారితీసిందని ఆయన చెప్పారు. నవంబర్‌లో బంగారం దిగుమతులు 80 టన్నులకు ..
దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగిపోతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యల్లో బంగారం అమ్మకాలు భారీగా సాగుతుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. పెళ్లిళ్ల సీజన్‌లో బంంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇదిలా ఉండగా దేశంలో బంగారం దిగుమతిలో 31 నెలల నాటి రికార్డు అక్టోబర్‌లో నమోదైంది. అక్టోబర్‌లో దేశంలోకి 123 టన్నుల బంగారం దిగుమతి అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది 31 నెలల్లో అత్యధికంగా నెలవారీ దిగుమతులు అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది దిగుమతుల్లో 60 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో దేశంలోకి 77 టన్నుల బంగారం దిగుమతి అయింది. అక్టోబర్ నెలలో 123 మెట్రిక్ టన్నుల గోల్డ్‌ను దిగుమతి చేసుకోవడం రికార్డ్ సృష్టించింది. గత దశాబ్దంలో అక్టోబర్‌లో సగటు నెలవారీ దిగుమతులు 66 టన్నులు. విలువ పరంగా, అక్టోబర్ దిగుమతులు అంతకు ముందు ఏడాది $3.7 బిలియన్ల నుంచి దాదాపు రెట్టింపు $7.23 బిలియన్లకు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ ప్రారంభంలో స్థానిక ధరలు 7 నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి.
ఇది ఆభరణాల వ్యాపారులకు పండుగల కోసం నిల్వ చేయడానికి అవకాశం కల్పిస్తుందని ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ బ్యాంక్ బులియన్ డీలర్ చెప్పారు. నగల వ్యాపారులు తక్కువ స్టాక్‌లతో పనిచేస్తున్నారు. అలాగే అక్టోబర్‌లో తగ్గిన ధరల స్థానాన్ని తిరిగి భర్తీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయులు హిందూ పండుగ అయిన దసరాను అక్టోబర్‌లో జరుపుకోగా, దీపావళి ఈ నెలలో జరుపుకొన్నారు. పంగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారని తెలిపారు.
స్థానిక బంగారం ఫ్యూచర్స్ నవంబర్‌లో రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 61,914 రూపాయలకు చేరుకుంది. అయితే దీపావళి సందర్భంగా డిమాండ్ బలంగా ఉందని పూణే నగరంలోని జ్యువెలర్ పిఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ సిఇఒ అమిత్ మోదక్ తెలిపారు. ప్రజలు బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి ఉత్పత్తిగా భావించడం వల్ల నాణేలు, బార్‌లకు బలమైన డిమాండ్ ఉందని, ఇది కొనుగోళ్లను పెంచడానికి దారితీసిందని ఆయన చెప్పారు. నవంబర్‌లో బంగారం దిగుమతులు 80 టన్నులకు పడిపోవచ్చని, ఇది గత ఏడాది 67 టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని, రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ మెరుగుపడుతుందని బ్యాంక్ డీలర్ తెలిపారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కట్నాల రూపంలో వధువు కోసం ఆభరణాల తయారీ కోసం బంగారం భారీగానే కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి