Supreme Court: పతంజలి ఆయుర్వేద ప్రకటనలు నిలిపివేయాలి.. ఐఎంఏ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్డు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులంటే ఒకప్పుడు ఎగబడి కొనేవారు కస్టమర్లు. దీనికి గల ప్రధాన కారణం వాణిజ్య ప్రకటనలైతే మరొకటి యోగా గురు రామ్ దేవ్ బాబా ప్రత్యేకంగా వీటిని మార్కెట్లోకి తీసుకురావడం. రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వాడకంపై అప్పుడప్పుడే లోకంలో అవగాహన కలగడంతో పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోయింది. పైగా ధర చాలా తక్కువ మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తారన్న నమ్మకం.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులంటే ఒకప్పుడు ఎగబడి కొనేవారు కస్టమర్లు. దీనికి గల ప్రధాన కారణం వాణిజ్య ప్రకటనలైతే మరొకటి యోగా గురు రామ్ దేవ్ బాబా ప్రత్యేకంగా వీటిని మార్కెట్లోకి తీసుకురావడం. రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వాడకంపై అప్పుడప్పుడే లోకంలో అవగాహన కలగడంతో పతంజలి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోయింది. పైగా ధర చాలా తక్కువ మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తారన్న నమ్మకం. ఈ రెండూ బలంగా పాతుకుపోయాయి ప్రజల్లో. దీంతో మార్కెట్ ను ఒక కుదుపు కదిపింది. 2016 నుంచి కోవిడ్ వరకూ దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. షాంపూ మొదలు డిటర్జెంట్ సోప్ వరకూ అన్నింటా ఆయుర్వేదమే అనేలా ప్రాపగండ చేశారు. దీంతో ప్రజలు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. అయితే తాజాగా పతంజలి చేసే వ్యాపార ప్రకటనలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది.
ఆధునిక వైద్యంపై పతంజలి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ధర్మసనం తీర్పు వెలువరించింది. ఆధునిక ఔషధాలు, టీకాలను లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను హెచ్చరిస్తూ పతంజలి ఆయుర్వేదానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ, ఎలాంటి మోసపూరిత ప్రకటనలు చేయకుండా ఉండాలని కోర్టు పతంజలిని ఆదేశించింది. కోర్టు తీర్పును పాటించని పక్షంలో పెద్దమొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఆధునిక వైద్యంపై తప్పుడు సమాచారం ఇచ్చే ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని సూచిస్తూ.. అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
వైద్యరంగంలో బాధ్యతాయుతమైన ప్రకటనల ఆవశ్యకతను చెబుతూ.. ఆరోగ్య సంరక్షణ, ఖచ్చితమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్ ని అందించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ చేసిన తప్పుడు వాణిజ్య ప్రకటనలపై రూ. 1కోటి వరకూ జరిమానా విధించాలనే అంశంపై పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..