Biggest Sixes: వరల్డ్ కప్‌లో భారీ సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు వీరే.. శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక ఘనత.. !

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ టోర్నీలో భారత క్రికెటర్లతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టించి.. ఫ్యాన్స్‌‌ను అసలుసిసలైన క్రికెట్ మజాను అందించారు. చాలా మ్యాచ్‌లలో 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు, బౌండరీలతో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపించారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా 644 సిక్సర్లు నమోదయ్యాయి.

Biggest Sixes: వరల్డ్ కప్‌లో భారీ సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు వీరే.. శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక ఘనత.. !
Shreyas Iyer Biggest Six
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 22, 2023 | 1:31 PM

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ టోర్నీలో భారత క్రికెటర్లతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టించి.. ఫ్యాన్స్‌‌ను అసలుసిసలైన క్రికెట్ మజాను అందించారు. చాలా మ్యాచ్‌లలో 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు, బౌండరీలతో ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపించారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా 644 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ వరల్డ్ కప్ టోర్నీలో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే కావడం విశేషం. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ (31 సిక్సర్లు) నిలిచాడు. అలాగే దక్షిణాఫ్రికా అత్యధిక సిక్సర్లు (99) సాధించిన జట్టుగా నిలిచింది. అయితే రోహిత్ శర్మ, దక్షిణాఫ్రియా ఆటగాళ్లు ఎవరూ.. ఈ టోర్నీలో భారీ సిక్సర్లు కొట్టిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. వరల్డ్ కప్ టోర్నీలో కొన్సి భారీ సిక్సర్లు 100 మీటర్ల దూరాన్ని అధిగమించాయి.

మరి ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారీ సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  1. నెం.1 డారిల్ మిట్చెల్ (న్యూజిలాండ్): 2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో అతి భారీ సిక్సర్‌ను మిట్చెల్ బాదాడు. ముంబైలో భారత్‌తో జరిగిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 107 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
  2. నెం.2 శ్రేయాస్ అయ్యర్: ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.
  3. నెం.3 మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 104 మీటర్ల దూరానికి భారీ సిక్సర్ బాదాడు.
  4. నెం.4 కేఎల్ రాహుల్: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 104 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
  5. నెం.5 శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 101 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.

2023 వరల్డ్ కప్‌లో 100 మీటర్ల దూరానికి పైగా రెండు సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ ఘనత సాధించాడు. అయ్యర్ కొట్టిన ఓ సిక్సర్ 106 మీటర్లు, మరో సిక్సర్ 101 మీటర్ల దూరానికి వెళ్లింది.

అయ్యర్ 106 మీటర్ల భారీ సిక్సర్ వీడియో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!