AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTuber Mr.Beast: బ్రతికుండగానే సమాధిలోకి వెళ్లిపోయిన యూట్యూబర్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఈ మధ్య కొందరు యూట్యూబర్స్‌ చేసే పనులకు అర్థం పర్థం లేకుండా పోతోంది. లైక్స్‌, వ్యూస్‌ వస్తున్నాయంటే చాలు ఏం చేసేందుకైనా రెడీ ఐపోతున్నారు. కొందరు చిన్న పాటి మొక్కలు నాటుకుంటూ గార్డెనింగ్ పేరుతో వీడియోలు చేస్తూ ఉంటారు. మరి కొందరు ఎంత రిస్క్‌ ఐనా సరే ఇట్టే చేసేస్తున్నారు. ఇంకొందరు ప్రాణాలకు తెగించి వీడియోలు చేస్తుంటే.. మరికొందరు అత్యంత ధైర్యసాహసాలకు ఒడిగడుతున్నారు.

YouTuber Mr.Beast: బ్రతికుండగానే సమాధిలోకి వెళ్లిపోయిన యూట్యూబర్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
Youtuber Mrbeast Spent Seven Days Sealed Inside A Coffin And Buried Underground In A Jaw Dropping Stunt
Srikar T
|

Updated on: Nov 22, 2023 | 2:22 PM

Share

ఈ మధ్య కొందరు యూట్యూబర్స్‌ చేసే పనులకు అర్థం పర్థం లేకుండా పోతోంది. లైక్స్‌, వ్యూస్‌ వస్తున్నాయంటే చాలు ఏం చేసేందుకైనా రెడీ ఐపోతున్నారు. కొందరు చిన్న పాటి మొక్కలు నాటుకుంటూ గార్డెనింగ్ పేరుతో వీడియోలు చేస్తూ ఉంటారు. మరి కొందరు ఎంత రిస్క్‌ ఐనా సరే ఇట్టే చేసేస్తున్నారు. ఇంకొందరు ప్రాణాలకు తెగించి వీడియోలు చేస్తుంటే.. మరికొందరు అత్యంత ధైర్యసాహసాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు మీకు చెప్పబోయే యూట్యూబర్‌ కూడా అలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యూట్యూబపేరు మిస్టర్‌ బీస్ట్‌. మనోడికి యూట్యూబ్‌లో 21 కోట్లకు పైగా సబ్స్‌క్రైబర్స్‌ ఉన్నారు. ఇన్ని సబ్స్ క్రైబర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. చాలా  ఆసక్తికరమైన కంటెంట్ ను అందిస్తేనే ఈ స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ సబ్ స్క్రైబర్ల సంతోషం కోసం అప్పుడప్పుడు కొన్ని డేంజరస్‌ స్టంట్లు చేస్తుంటారు మిస్టర్‌ బీస్ట్‌.

రీసెంట్‌గా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సమాధిలోకి వెళ్లిపోయాడు. తన సమాధిని తానే కట్టుకుని వారంపాటు అందులోనే ఉన్నాడు. వారం తరువాత మళ్లీ బయటికి తిరిగి వచ్చాడు. తన ఎక్స్‌పీరియన్స్‌ను తన ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. అయితే వారం రోజుల పాటు తనకు అవసరం ఉండే వస్తువులను ముందుగానే సమాధిలో పెటుకున్నాడు బీస్ట్‌. వారం పాటు వీటినే తింటు సమాధి లోపలే గడిపాడు. గతంలో కూడా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు మిస్టర్‌ బీస్ట్‌. 2021లో కూడా ఇలాగే సమాధిలోకి వెళ్లిపోయాడు. దాదాపు 50 గంటలు సమాధిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఏకంగా వారం పాటు సమాధిలో గడిపి తన రికార్డ్‌ను తానే బ్రేక్‌ చేసుకున్నాడు. ఇలాంటివి చూసినప్పుడు వినోదాన్ని, ఆసక్తిని, ఆందోళనను కలిగించవచ్చు. కానీ ప్రయోగం వికటిస్తే ప్రమాదం ఎదుర్కోకతప్పదు అనే చిన్న పాటి సూత్రాన్ని విస్మరిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వారికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొత్త ఒక వింత అనే సామెత పెట్టుకొచ్చిందని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..