Railways Updates: రైళ్లలో ఇక హాయిగా నిద్రపోండి.. మీకోసమే ఈ సరికొత్త సదుపాయం.. పూర్తి వివరాలివే..!

Indian Railways: రైళ్లలో ప్రయాణించే వారిలో చాలా మంది సుదూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులతో పాటు.. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు..

Railways Updates: రైళ్లలో ఇక హాయిగా నిద్రపోండి.. మీకోసమే ఈ సరికొత్త సదుపాయం.. పూర్తి వివరాలివే..!
Indian Railways
Follow us

|

Updated on: May 28, 2022 | 4:00 PM

Indian Railways: రైళ్లలో ప్రయాణించే వారిలో చాలా మంది సుదూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులతో పాటు.. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు, కూలీలు, వ్యాపారులు కూడా ఉంటారు. అయితే, చాలా మంది నిద్రలేకపోవడం కారణంగా.. ప్రయాణికులు తాము దిగాల్సిన గమ్యస్థానాన్ని దాటి మరో స్టేషన్‌కు వెళ్లే సందర్భాలు చాలానే ఉన్నాయి. దీని వల్ల ప్రయాణికులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర కారణంగా స్టేషన్ దాటి పోవడంతో.. వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే.. ఇండియన్ రైల్వేస్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం ఫీచర్. దీని ద్వారా ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు అధికారులు.

20 నిమిషాల ముందే అలర్ట్ చేస్తుంది.. ప్రయాణికుల అవస్థలను గుర్తించిన రైల్వే.. డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్.. ప్రయాణికుడికి డెస్టినేషన్‌కు 20 నిమిషాల ముందే అలర్ట్ చేసింది. ఒక కాల్ మాదిరిగా ఈ అలర్ట్ వస్తుంది. ఈ సదుపాయాన్ని IVR ఆన్ ఎంక్వైరీ సర్వీస్‌తో లింక్ చేస్తూ ప్రారంభించారు. ప్రయాణికులు 139 నంబర్‌కు కాల్ చేసి కస్టమర్‌ కేర్‌కు కాల్ చేయడం ద్వారా ఈ అలర్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సౌకర్యాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవచ్చు.. డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం ఫీచర్‌ కోసం IRCTC నంబర్ 139కు మొబైల్ నుండి కాల్ చేయాలి. ఆ తరువాత మొదట సెలక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. భాషను ఎంచుకున్న తరువాత గమ్యస్థానం అలర్ట్ కోసం మొదట 7, ఆ తరువాత 2 నెంబర్లను క్లిక్ చేయాలి. ప్రయాణికుల నుంచి 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. ఆ తరువాత పీఎన్ఆర్ నంబర్ ధృవీకరిస్తుంది. డెస్టినేషన్ స్టేషన్ కోసం అలర్ట్ రింగ్ వస్తుంది. దీని తర్వాత మీకు నిర్ధారణకు సంబంధించి ఎస్ఎంఎస్ పొందుతారు. గమ్యస్థానం చేరేలోపు మీ మొబైల్‌కు కాల్ వస్తుంది. అయితే, ఒక్కో అలర్ట్ ఎస్ఎంఎస్‌కు రూ. 3 ఛార్జీ చేయడం జరుగుతుంది. అదే విధంగా మెట్రో నగరాల్లో కాల్‌కు నిమిషానికి రూ.1.20, ఇతర నగరాల్లో నిమిషానికి రూ. 2 వసూలు చేస్తారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.