AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు.. ప్రవాహానికి కొట్టుకొచ్చినా సీతారాములను వీడని హనమంతుడు..!

Telangana: నదీ ప్రవాహానికి ఇసుక సహా చిన్న చిన్న రాళ్లు కొట్టుకురావడం సహజం. అయితే, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద దేవతామూర్తుల విగ్రహాలు కొట్టుకు వచ్చాయి.

Telangana: కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు.. ప్రవాహానికి కొట్టుకొచ్చినా సీతారాములను వీడని హనమంతుడు..!
Lord Rama
Shiva Prajapati
|

Updated on: May 27, 2022 | 7:14 PM

Share

Telangana: నదీ ప్రవాహానికి ఇసుక సహా చిన్న చిన్న రాళ్లు కొట్టుకురావడం సహజం. అయితే, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద దేవతామూర్తుల విగ్రహాలు కొట్టుకు వచ్చాయి. ఎలా వచ్చాయో.. ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చాయో తెలియదు గానీ.. అకస్మాత్తుగా నదీ ఒడ్డున ఆంజనేయ సమేత సీతారామ లక్షణుల విగ్రహాలు దర్శనమిచ్చాయి. అత్యంత పురాతనమైనవిగా కనిపిస్తున్న ఈ విగ్రహాల పక్కనే నీటిలోనే చెల్లాచెదురుగా కుండలు, ఇతర పూజా సామాగ్రి ఉన్నాయి. ఆత్మకూరు మండలం జూరాల సమీపంలో ఈ విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. అయితే, నదీ ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ విగ్రహాలను, ఇతర పురాతన వస్తువులను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. కొట్టుకొచ్చిన సీతారామ లక్ష్మణుల విగ్రహాల సమీపానికే విడిగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కొట్టుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే, నదీ తీరానికి కొట్టుకొచ్చిన విగ్రహాలను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా పురాతనమైన విగ్రహాలుగా భావించి.. అధికారులకు సమాచారం అందించారు. కాగా, నీటిలో కొట్టుకువచ్చిన విగ్రహాలు.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం. అందులోనూ విగ్రహాలకు ఆభరణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే అప్‌డేట్ ఇవ్వడం జరుగుతుంది.

Rama Laxmna

Rama Laxmana