Legrand India: తెలంగాణలో మొట్టమొదటి స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ స్టూడియోను ఏర్పాటు చేసిన లెగ్రాండ్‌ ఇండియా

Legrand India: ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న లెగ్రాండ్ ఎలక్ట్రికల్, డిజిటల్ బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తమ మొదటి రిటైల్ అవుట్‌లెట్- లెగ్రాండ్ స్టూడియోను..

Legrand India: తెలంగాణలో మొట్టమొదటి స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ స్టూడియోను ఏర్పాటు చేసిన లెగ్రాండ్‌ ఇండియా
Legrand India
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2022 | 7:44 PM

Legrand India: ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న లెగ్రాండ్ ఎలక్ట్రికల్, డిజిటల్ బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తమ మొదటి రిటైల్ అవుట్‌లెట్- లెగ్రాండ్ స్టూడియోను ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్ కమ్ రిటైల్ అవుట్‌లెట్ లెగ్రాండ్స్ ఇండియా గ్రూప్ కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులను హోస్ట్ చేస్తుంది. ఈ కంపెనీ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. దీని ద్వారా రీటెయిల్ అవుట్‎లెట్ లెగ్రాండ్ ఇండియా గ్రూప్ కంపెనీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తుంది. లెగ్రాండ్ వినియోగదారులకు డిజిటల్‎గా అధిక అనుభవాన్ని అందించడమే కాకుండా దేశంలో లెగ్రాండ్ ఫుట్ ప్రింట్స్ ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశములో లెగ్రాండ్ ఇన్నొవల్, స్టూడియో, షాప్-ఇన్-షాప్ వంటి వివిధ ఫార్మాట్ లలో 30 ఉత్పత్తుల షోరూమ్స్ కలిగి ఉంది.

లెగ్రాండ్ స్టూడియో లెగ్రాండ్ ఇండియా ఉత్పత్తి షోకేస్ కొరకు ఒక ప్రపంచవ్యాప్త బ్రాండ్. లెగ్రాండ్ స్టూడియో నివాస, వాణిజ్య, ఆసుపత్రి, పారిశ్రామిక మార్కెట్ల కొరకు రూపొందించబడినది. స్టూడియోలో ఉత్పత్తి ఆఫరింగ్స్ అన్నీ వ్యాపార అంశాల ప్రకారము ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఉదాహరణకు.. హోమ్ ఆటోమేషన్, యూజర్ ఇంటర్ఫేస్, ఐఓటి, ఎలెక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేబుల్ మేనేజ్మెంట్ వంటివి. ఉత్పత్తులను వినియోగదారులు స్టూడియో ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.

పెట్టుబడిదారుల నుండి ఇన్స్టాలర్స్ వరకు ఎలెక్ట్రికల్ వ్యాపారములోని వారు అందరికి ఒక శిక్షణా కేంద్రముగా లెగ్రాండ్ స్టూడియో రెట్టింపుగా సహాయపడుతుంది. ఒక పరిశ్రమగా లెగ్రాండ్ తన ఆవిష్కరణలకు, పరిష్కారాలకు చేర్చే విలువలకు మరియు నిరంతరం మారే వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు వృత్తినిపుణులకు సహాయపడటములో లెగ్రాండ్ పేరుగాంచింది. లెగ్రాండ్ ప్రపంచములోనే ప్రముఖమైన ఎలెక్ట్రికల్, డిజిటల్ నిర్మాణ సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ. దీని ప్రపంచవ్యాప్తంగా టర్నోవర్ 6.6 బిలియన్ యూరోస్. ఈ సంస్థ భారత మార్కెట్లో ప్రీమియం వైరింగ్ పరికరాలు మరియు రక్షణాత్మ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి