Hyderabad: అమ్మాయిలూ బీ అలెర్ట్.. ఇది మాములు ట్రాప్ కాదు.. ఇళ్లు అద్దెకిస్తామని పిలిచి.. అత్యాచారం
అమ్మాయిలూ బీ అలెర్ట్..! మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ కీచకుడు ఏ రూపంలో వచ్చి కాటు వేస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది.
- ఇల్లు అద్దెకిస్తామని పిలిచి యువతిపై అత్యాచారం…
- హైదరాబాద్ చాదర్‌ఘాట్ పరిధిలో హమీద్ అనే యువకుడిపై కేసు
- Flat N Flatmate పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన హమీద్
- అద్దె ఇళ్ల కోసం ప్రయత్నించే అమ్మాయిలను ట్రాప్ చేస్తు్న హమీద్
- ఇల్లు చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి దాడులు
- హమీద్‌పై ఫిర్యాదు చేసిన యువతి.. 354A, B 342, 323 ఐపీసీ కింద కేసులు నమోదు
Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన దారుణం ఇది. నాగోల్‌లో ఇల్లు అద్దెకు కావాలని ప్రయత్నించిన ఓ యువతిని ట్రాప్ చేశాడు హమీద్ అనే వ్యక్తి. హైదరాబాద్ సిటీ తెలియని ఆ యువతిని ఓల్డ్‌సిటీ వరకూ తీసుకెళ్లాడు. ఇల్లు చూపించి.. లోపలికి ఎంటర్‌కాగానే తలుపులు వేసేసి దాడి చేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చాదార్గాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందో యువతి. మొదట బయటకు చెప్పడానికి జంకిన బాధితురాలు, ఓ స్నేహితురాలు ఇచ్చిన ధైర్యంతో పోలీసు స్టేషన్ దాకా వచ్చింది. Flat N Flatmate పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన హమీద్.. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు తెలిసింది. యువతి ఫిర్యాదు మేరకు యువతిపై 354A, B 342, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి