Nikhat Zareen: హైదరాబాద్‌కు చేరుకున్న వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌.. ఘన స్వాగతం పలికిన తెలంగాణ సర్కార్‌

Nikhat Zareen: వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కి ఘనస్వాగతం పలికింది తెలంగాణ సర్కారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన..

Nikhat Zareen: హైదరాబాద్‌కు చేరుకున్న వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌.. ఘన స్వాగతం పలికిన తెలంగాణ సర్కార్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2022 | 5:31 PM

Nikhat Zareen: వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కి ఘనస్వాగతం పలికింది తెలంగాణ సర్కారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో నిఖత్ జరీన్.. సరికొత్త చరిత్ర లిఖించింది. 52 కేజీల విభాగం ఫైనల్లో జరీన్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌ను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది. తన విజయాన్ని తెలంగాణకు అంకితం చేసింది నిఖత్‌. ప్రభుత్వం అందించిన సహకారం వల్లే పతకాన్ని సాధించానని చెప్పింది. ఆమెకు ఘనస్వాగతం తర్వాత శంషాబాద్‌ నుంచి ఎల్బీస్టేడియానికి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఈ ర్యాలీలో మంత్రులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం తీసుకురావడమే తన తక్షణ కర్తవ్యమంది నిఖత్‌. ఒలింపిక్స్‌ మెడల్‌ తన డ్రీమ్‌అని ప్రకటించింది. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి నిఖత్‌కి ఘనస్వాగతం పలికారు. ఆమెతోపాటు.. షూటర్‌ ఇషాసింగ్‌కీ పుష్పగుచ్చం అందించి అభినందించారు. వీరిద్దరు తెలంగాణ మాణిక్యాలని పొగడ్తలతో ముంచెత్తారు మంత్రులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి