Telangana: పోలీసు ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు.. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికం

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన...

Telangana: పోలీసు ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు.. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికం
Tslprb Application
Follow us

|

Updated on: May 27, 2022 | 8:20 PM

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అప్లై చేసుకోవాలని సూచించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాలకు నోటిఫికేషన్(Jobs Notification) విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా అప్లికేషన్లు చేసుకున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. మరికొందరు రెండింటికీ అప్లై చేశారు. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన పోలీసు ఉద్యోగాల కోసం 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకు 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో 7.65% ఓసీలు, 8.27% బీసీ (ఏ), 17.7% బీసీ (బీ), 0.26% బీసీ (సీ), 20.97% బీసీ (డీ), 4.11% బీసీ (ఈ), 22.44 % ఎస్సీ, 18.6% ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది, ఇంగ్లీష్ లో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి