Viral Video: చేపల కోసం వల వేశాడు.. చిక్కింది చూసి షాకయ్యాడు.. వీడియో వైరల్!
ఓ వ్యక్తి దగ్గరలోని సరస్సులో చేపలు పట్టేందుకు వచ్చాడు. బోలెడన్ని చేపలు ఇంటికి పట్టుకెళ్లాలని అనుకున్నాడు. అదే ఊపుతో గాలం నీటిలోకి వేశాడు..
ఓ వ్యక్తి దగ్గరలోని సరస్సులో చేపలు పట్టేందుకు వచ్చాడు. బోలెడన్ని చేపలు ఇంటికి పట్టుకెళ్లాలని అనుకున్నాడు. అదే ఊపుతో గాలం నీటిలోకి వేశాడు.. కొద్దిసేపటికి ఆ గాలం బలంగా అనిపించింది. భారీ చేప చిక్కింది ఏమో.. నా పంట పండిందని అనుకుంటూ.. దాన్ని బయటికి లాగాడు.. అంతే అక్కడ కనిపించింది చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. అదేంటో తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని బోస్టన్, ఫ్లోరిడా, లూసియానా లాంటి పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సమ్మర్‌లో స్థానికంగా ఉండే సరస్సుల్లో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దగ్గరలోని సరస్సుకు చేపల కోసం వెళ్లాడు. గాలానికి ఎరను పెట్టి నీటిలో వేశాడు. కొద్దిసేపటికి గాలం బలంగా అనిపించింది. ఏదో భారీగా చిక్కిందని అనుకున్నాడు.. ఫిషింగ్ రాడ్‌ను నెమ్మదిగా పైకి లాగాడు. అతడు అనుకున్నట్లే.. గాలానికి బోలెడన్ని చేపలు చిక్కాయి.. అయితే అనూహ్యంగా అందులో ఒక చెప్పాను పాము గట్టిగా నోట కరవడంతో.. వాటితో పాటు అది కూడా పైకి వచ్చేసింది.
View this post on Instagram
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి..