AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Application for Passport: పాస్‌పోర్ట్‌ కావాలా.. అయితే ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఓటరు కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తోపాటు మనకు చాలా ముఖ్యమైనది పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లడానికి ఇది చాలా ముఖ్యమైన పత్రం.. ఇది లేకుండా...

Application for Passport: పాస్‌పోర్ట్‌ కావాలా.. అయితే ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి..
Online In India E Form Subm
Sanjay Kasula
|

Updated on: Nov 28, 2021 | 2:18 PM

Share

Application for Passport: మీరు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? ఇందు కోసం కావల్సిన ఓ ముఖ్యమైన పత్రం మీ వద్ద ఉందా..? ఓటరు కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తోపాటు మనకు చాలా ముఖ్యమైనది పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లడానికి ఇది చాలా ముఖ్యమైన పత్రం.. ఇది లేకుండా మీకు వీసా లభించదు. మీరు విదేశాలకు వెళ్లలేరు. మరోవైపు, పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లడం మానుకుంటున్నారు. ఈ సందర్భంలో మీకు కావాలంటే మీరు ఇంట్లో కూర్చొని పాస్పోర్ట్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఒకసారి మాత్రమే వెళ్లాలి. ఇప్పుడు పాస్‌పోర్టు పొందడం చాలా సులువుగా మారింది.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ ఎలా పొందాలో..

– ముందుగా మీరు పాస్‌పోర్ట్ సర్వీస్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీరు పేరు, నంబర్ ఉపయోగించి ఇక్కడ నమోదు చేసుకోవాలి.

– దీని తర్వాత మీరు దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, పుట్టిన తేదీ.. సమీపంలోని పాస్‌పోర్ట్ కార్యాలయం గురించి సమాచారాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను సేవ్ చేసుకునే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

– దీని తర్వాత, మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్ / రీఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ సమాచారాన్ని పూరించడానికి ఎంపికపై క్లిక్ చేయండి.

– దీని తర్వాత, మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించాలి, ఆపై సమర్పించుపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు సేవ్ చేసిన / సమర్పించిన అప్లికేషన్‌లకు వెళ్లి ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

– ఇప్పుడు మీరు మీ సమీపంలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, దాని కోసం మీరు పే & బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఫారమ్.. రశీదును ప్రింట్ చేయాలి. అప్పుడు మీరు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లాలి. ఆపై పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ పాస్‌పోర్ట్ కొన్ని రోజుల్లో మీ ఇంటికి పోస్టులో వస్తుంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..