చీమకు కూడా పళ్లు ఉంటాయని మీకు తెలుసా.. అవి కూడా ఒకటి, రెండు కాదు.. ఎన్నో తెలుసా..

చీమకు కూడా పళ్లు ఉంటాయని మీకు తెలుసా.. అవి కూడా ఒకటి, రెండు కాదు.. ఎన్నో తెలుసా..
Ants

చీమకు కూడా చాలా దంతాలు ఉంటాయి. వాటి దంతాలకు కూడా చాలా బలం ఉంటాయి. అయితే ఎన్నిపళ్ళు ఉంటాయి..? ఈ పళ్ళు చీమకు ఎలా ఉపయోగపడతాయో..

Sanjay Kasula

|

Dec 06, 2021 | 1:11 PM

చీమ చాలా చిన్న జీవి.. అంతేకాదు ఈ జీవికి సంబంధించిన అనేక విషయాలు మనను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి జీవనం సమిష్టి జీవనం ఒకే పుట్టలో కలిసి ఉంటాయి. కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది. కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. మనిషికంటే తెలివైనవని ప్రతి ఒక్కరు ఒప్పుకోవల్సిందే. అంతే కాదు వాటి జీవన విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. ఇవి నిజంగా ఆశ్చర్యకరమైనవి. చీమ, ఏనుగుల జోక్‌కి మీరు చాలా నవ్వి ఉండవచ్చు, కానీ చీమల గురించి చాలా వాస్తవాలు ఉన్నాయి.

అవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఒక వాస్తవం కూడా ఒకటి ఉంది. వాటి దంతాలకు సంబంధించినది. చీమకు దంతాలు లేవని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. చీమకు కూడా చాలా దంతాలు ఉంటాయి. వాటి దంతాలకు కూడా చాలా బలం ఉంటాయి. అయితే ఎన్నిపళ్ళు ఉంటాయి..? ఈ పళ్ళు చీమకు ఎలా ఉపయోగపడతాయో మీకు తెలుసు. చీమల దంతాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం.. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

చీమలకు కూడా పళ్లు ఉంటాయి..

చిన్నగా కనిపించే చీమ నోటిలో చాలా పళ్ళు ఉంటాయి. విశేషమేమిటంటే చాలా పళ్ళు ఉన్నాయి. అవి చాలా చిన్నవి. చీమల శరీరం కూడా పూర్తి దవడను కలిగి ఉంటుంది. దవడలో చాలా దంతాలు ఉన్నాయి. ఈ దంతాలు మనిషి వెంట్రుకలలా సన్నగా ఉంటాయి. అయితే మనిషి దంతాల కంటే పదునుగా ఉంటాయని చెబుతున్నారు. మనిషి దంతాలు కొరకలేని వాటిని చీమల దంతాలు సులభంగా కొరుకుతాయి.

అదేవిధంగా, చీమల పళ్ళు కూడా చర్మాన్ని కొరుకుతాయి. కానీ మానవ దంతాలు ఈ పని  చేయలేవు. కాబట్టి అవి చాలా ప్రమాదకరమైనవి. చీమల పళ్లు మానవ చర్మాన్ని సులభంగా కొరుకుతాయి.. అయితే మనిషి దంతాలు అలా చేయడం కష్టమని సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే పరిశోధనా జర్నల్ వెల్లడించింది.

ఇలా వేగంగా

చిన్న జీవులు తమ మైక్రోస్కోపిక్ పరికరాలను పదును పెట్టడానికి జింక్‌ను ఉపయోగిస్తాయని అనేక నివేదికలు వెల్లడించాయి. జింక్ అణువుల పొర చీమల దంతాలను గట్టిగా.. పదునైన సాధనాలుగా మారుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అదే విధంగా అమర్చబడిన దంతాల జింక్ అణువుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. తద్వారా ఏదైనా కొరికినప్పుడు జీవుల శక్తులు సమానంగా పంపిణీ చేయబడతాయి. దీంతో చీమ తనని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. చీమల దవడలు.. దంతాలు చాలా గట్టిగా ఉంటాయి.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమ?

బుల్ డాగ్ యాంట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమ. ఇది ఆస్ట్రేలియా తీర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ చీమలు తమ ఆహారం కోసం ఎక్కువగా రాత్రి సమయంలో బయటకు వస్తాయి. ఈ చీమల ప్రత్యేకత ఏంటంటే.. దవడలను ఉపయోగించి దాడి చేయడం. ఈ చీమను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీమ అంటారు. బుల్ డాగ్ చీమల పరిమాణం 1 అంగుళం కంటే తక్కువగా ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu