Viral Video: ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన పిల్లాడు.. కట్ చేస్తే ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే అనూహ్య..
భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే అనూహ్య ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. మరికొందరైతే అదృష్టం కొద్దీ వెంట్రుక వాసిలో ఊహించని విధంగా తప్పించుకుంటుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఇక్కడ ఓ పిల్లోడు చేసిన అల్లరి.. ప్రాణాల మీదకు తెచ్చింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి..
సాధారణంగా పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారు ఎక్కడున్నా కూడా ఇల్లు పీకి పందిరి వేస్తారు. అయితే వీరి చేసే అల్లరి అనూహ్యంగా ప్రమాదాలు కొనితేవచ్చు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ఓ పిల్లాడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో బయటపడ్డాడు. ఆ వీడియో మీకోసమే..
వైరల్ వీడియో ప్రకారం.. ఓ రెస్టారెంట్‌లో పిల్లాడు తన తల్లిని పక్కకు తోసేసి.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా ఆ ఫ్రిడ్జ్ కాస్తా పిల్లాడిపై పడిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అటుగా ఆర్డర్ తీసుకుని వెళ్తున్న వెయిటర్ దీన్ని గమనించి.. వెంటనే తన చేతులోని ట్రే ప్లేట్ ద్వారా ఆ ఫ్రిడ్జ్ అమాంతం పిల్లాడిపై పడిపోకుండా అడ్డుకున్నాడు. ఈలోపు అతడి తల్లి, అక్కడే ఉన్న మిగిలిన వ్యక్తులు రావడంతో ఆ పిల్లాడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి..