Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!

Omicron Tension: ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది...

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 06, 2021 | 6:36 AM

Omicron Tension: ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 41 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క దక్షిణాఫ్రికాలో 217మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారు. దీంతో మళ్లీ ఏడాదిన్నర కిందటి పరిస్థితులు తలెత్తుతాయా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.

దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పాకిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్‌, వాషింగ్టన్‌ కూడా చేరాయి. ఇప్పటికే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌, మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ సెంటర్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండింతలకు పెరగింది. మరోవైపు డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. ఎమర్జెన్సీ కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు.

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌..

ఇటు భారత్‌లోనూ ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది న్యూ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్‌ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు.. ఢిల్లీలో ఇంకో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్‌ సోకింది. దీంతో దేశంలో 3 రోజుల్లోనే 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగానే దేశమంతా అలెర్ట్ అయింది. కానీ ఇప్పుడు మరో మూడు కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.

జింబాబ్వే నుంచి గుజరాత్‌కు..

జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్‌ లోని జామ్‌నగర్‌కు వచ్చిన 72 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి జామ్‌నగర్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపించారు. ఆ పరీక్షల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. అతను వ్యాక్సిన్ తీసుకోలేదని తేలింది.

విదేశాల నుంచి ముంబైకి వచ్చిన వారిలో 13 మందికి..

విదేశాల నుంచి ముంబైకి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్ తేలింది. తమిళనాడు వచ్చిన ఐదుగురికి చేసిన టెస్టుల్లోనూ కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు.. విదేశాల నుంచి ఇండియాలోని మిగతా నగరాలకు వచ్చిన వారిలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎంత మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో.. ఎంత మందికి నాన్ ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనేది తేలాల్చి ఉంది. వారందరికీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయితే దేశంలో ఈ కొత్త వేరియంట్ జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తుందనే ఆందోళనలు వ్యాక్తమవుతున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు..

ఇప్పటికే ఒమిక్రాన్‌తోనే టెన్షన్‌ పడుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజే 2,796 మరణాలు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎంత మందిని చంపుతుందోననే భయం వెంటాడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గడిచిన ఐదు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో డిసెంబర్‌ 1న 184 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. డిసెంబర్ 2న 189 కేసులు.. డిసెంబర్‌ 3న 198 కేసులు వచ్చాయి. కానీ డిసెంబర్ 4న 213 మందికి కరోనా సోకింది. అటు ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.

మనుషులను రాక్షసులుగా మారుస్తున్ ఒమిక్రాన్‌ భయం..

మరోవైపు ఒమిక్రాన్‌ భయం మనుషులను రాక్షసులుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో సైకోగా మారిన డాక్టర్‌ తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఒమిక్రాన్ వేరియంట్ అంద‌రినీ చంపేస్తుంది. శవాలను లెక్కించడం నా వల్ల కావడం లేదు.. అని డైరీలో రాసిన డాక్టర్ సుశీల్‌ కుమార్‌ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తరువాత పారిపోయాడు.

తాను డిప్రెషన్‌లో ఉన్నట్టు సోదరుడు సునీల్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ కూడా పెట్టాడు డాక్టర్‌ సుశీల్‌కుమార్. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగాదిప‌తిగా ప‌నిచేస్తున్న సుశీల్.. నిరంతరం ఒమిక్రాన్‌ .. కరోనా గురించి ఆలోచించి .. ఆలోచించి పిచ్చోడిగా మారిపోయాడు. ఉన్మాదంతో తన కుటుంబాన్ని హత్య చేశాడు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక తెలంగాణ, ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Omicron: భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి.. ఎలాంటి లక్షణాలు..!

Omicron Terror: ఒమిక్రాన్ భయం.. అమెరికా ప్రయాణాలకు ఇది తప్పనిసరి.. నిబంధనలు కఠినం చేసిన యూఎస్

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.