Omicron: భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి.. ఎలాంటి లక్షణాలు..!

Omicron: రెండేళ్ల నుంచి మనల్ని కాల్చుకుతింటున్న కరోనా వైరస్‌ ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. కొత్త కొత్త రూపాలను ధరిస్తూ మనపై దాడికి దిగుతుందా మహమ్మారి...

Omicron: భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి.. ఎలాంటి లక్షణాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 05, 2021 | 10:49 PM

Omicron: రెండేళ్ల నుంచి మనల్ని కాల్చుకుతింటున్న కరోనా వైరస్‌ ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. కొత్త కొత్త రూపాలను ధరిస్తూ మనపై దాడికి దిగుతుందా మహమ్మారి. ఇప్పుడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటి వరకు 40 దేశాలకుపైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. సౌతాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబైకి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 21 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీనిపై ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఆంక్షలను కఠినతరం చేశాయి.

సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్‌ యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపించ గుణం ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఈ రోజు మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాజస్థాన్‌లో నమోదైన 9 కేసులతో భారత్‌లో మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. ప్రస్తుతం రాజస్తాన్‌లో 9, మహరాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వేరియంట్‌ వివరాలు..

► నవంబర్‌ 9న దక్షిణాఫ్రికాలో తొలి కేసు నమోదు ► దీనిని డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు. ► నవంబరు24న డబ్ల్యూహెచ్‌వో (WHO) అధికారిక ప్రకటన ► అత్యంత వేగంగా విస్తరించే వేరియంట్ ► 3 రోజుల్లో 24 దేశాల్లో వ్యాప్తి ► భారత్‌లో 2 కేసులు

ఒమిక్రాన్ ప్రమాదమా?

► ఇమ్యునిటీని తట్టుకునే సామర్థ్యం ► 50 మ్యుటేషన్లతో 500 రెట్లు వ్యాప్తి ► వ్యాక్సిన్‌ పనిచేయదన్న WHO ► యాంటీ బాడీ ట్రీట్‌మెంట్‌ పనిచేయదు ► కరోనాకు వాడిన మందుల పనిచేస్తాయో లేదో? ► కరోనా వచ్చి తగ్గినవారిపై అధిక ప్రభావం

ఉపశమనం

► స్వల్పంగానే లక్షణాలు ► ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం ► తీవ్ర అనారోగ్యం కనిపించలేదు ► ఆసుపత్రికి వెళ్లకుండానే ఎక్కువమంది రికవరీ ► ఇప్పటివరకూ డెత్‌ రిపోర్ట్‌ లేదు ► దీనిపై అంచనాకు సమయం పడుతుంది

అలర్ట్‌

► థర్డ్‌వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌ ► మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తప్పనిసరి ► కరోనా టెస్టులు పెంచడం ► ప్రయాణాలపై ఆంక్షలు, కంటైన్‌మెంట్ జోన్లు ► ప్రత్యేకంగా ఆసుపత్రులు ►అవసరం అయితే లాక్‌డౌన్‌

ఇవి కూడా చదవండి:

Omicron Terror: ఒమిక్రాన్ భయం.. అమెరికా ప్రయాణాలకు ఇది తప్పనిసరి.. నిబంధనలు కఠినం చేసిన యూఎస్

Karimnagar district: చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. పదుల సంఖ్యలో విద్యార్థులకు పాజిటివ్