పెరుగు తొందరగా తోడుకోవాలా..? అయితే, ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..
దాదాపు అందరికీ పెరుగు అంటే చాలా ఇష్టం..ఎన్ని రకాల వంటకాలు తిన్నప్పటికీ చివర్లో కాస్త పెరుగన్నం తింటే తప్ప భోజనం చేసిన ఫిలింగ్ కలుగదు చాలా మందికి. అయితే, ఒక్కోసారి అనుకోకుండా టైమ్‌కి పెరుగు లేకపోయినా, తోడు సరిగా కాకపోయినా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు పెరుగు త్వరగా తోడుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం. అంత ఈజీ మరీ. పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చటి పాలను తీసుకోవాలి. అలా కాకుండా చల్లటి పాలలో తోడు పెడితే అది పాలలానే ఉంటుంది. అలాంటప్పుడు తోడుపెట్టినా తోడుకోకుండా ఉన్న పాలగిన్నెని, ఒక ప్లేట్లో గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో పెట్టాలి. తీయటి పెరుగు చిటికెలో తోడుకుంటుంది. ట్రై చేసి చూడండి.
అయితే, ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే..మిగిలిపోయిన పెరుగు మొత్తంలో పాలు పోసేస్తుంటారు చాలామంది… అలా చేయడం వల్ల పెరుగు పుల్లగా తోడుకుంటుంది. అలాకాకుండా స్పూన్ తో కొంచెం పెరుగు తీసుకుని, పాలల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే తీయటి పెరుగు తోడుకుంటుంది. అలాగే,మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. అలాగే, తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..