AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేశావ్ అమ్మాయ్.. లాయర్‌ చదువు చదివి ఇలాంటి పనిచేస్తావా..? ఇన్ స్టా ఫాలోవర్స్ కోసం..

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ 'ది మిషా అగర్వాల్ షో'లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మీషా కేవలం కంటెంట్ క్రియేటర్‌ మాత్రమే కాదు, లా చదువుతూ PCSJ కోసం సిద్ధమవుతోంది. ఆమె సృజనాత్మకత, తెలివితేటలు ఆమెను సోషల్ మీడియాలో యువతకు ప్రత్యేకంగా మార్చాయి.

ఎంత పని చేశావ్ అమ్మాయ్.. లాయర్‌ చదువు చదివి ఇలాంటి పనిచేస్తావా..? ఇన్ స్టా ఫాలోవర్స్ కోసం..
Misha Agrawal Death
Jyothi Gadda
|

Updated on: May 01, 2025 | 9:58 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు మీషా అగర్వాల్. కేవలం 24 సంవత్సరాల వయసులోనే లక్షలాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నివాసి అయిన మీషా, తన ప్రత్యేకమైన కామిక్ కంటెంట్, ఫన్నీ రీల్స్‌తో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ‘ది మిషా అగర్వాల్ షో’లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మీషా కేవలం కంటెంట్ క్రియేటర్‌ మాత్రమే కాదు, లా చదువుతూ PCSJ కోసం సిద్ధమవుతోంది. ఆమె సృజనాత్మకత, తెలివితేటలు ఆమెను సోషల్ మీడియాలో యువతకు ప్రత్యేకంగా మార్చాయి.

మిషా వీడియోలలో ఒకవైపు కామెడీ, నిజ జీవిత కథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరోవైపు, ఆమె నిజమైన భావోద్వేగాలు కూడా ప్రతిబింబించేలా చేస్తారు. దీని కారణంగా అభిమానులు ఆమెతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. కానీ, ఏప్రిల్ 26న మిషా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అది అందరినీ షాక్‌కు గురిచేసింది. అవును,.. తన 25వ పుట్టినరోజుకు కేవలం రెండు రోజుల ముందు అందరికీ సడెన్‌ షాక్‌ ఇస్తూ సూసైడ్‌ చేసుకుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారనే కారణంగా మిషా బలవన్మరణానికి పాల్పడింది. 2025 ఏప్రిల్ 30న మిషా కుటుంబం ఆమె ఆత్మహత్యకు గల కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మిషా మరణానికి అసలు కారణం ఏంటంటే..

మీషా చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందట. ఆమె తన ప్రపంచాన్ని ఇన్‌స్టాగ్రామ్ చుట్టూ నిర్మించుకున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఆమెకు ఒక మిలియన్ ఫాలోవర్స్ రావాలని కోరుకునేది, ఆ టార్గెట్‌ను తన మొబైల్ లాక్ స్క్రీన్‌పై కూడా పెట్టుకుంది. ఈ విషయమై మీషా సోదరి చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆలోజింపజేస్తోంది. “నా చెల్లెలు తన ప్రపంచాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫాలోవర్స్ చుట్టూ నిర్మించుకుంది. ఆమె లక్ష్యం ఒక మిలియన్ ఫాలోవర్స్ సంపాదించడమే. ఫాలోవర్స్ తగ్గడం మొదలవ్వగానే ఆమె కుంగిపోయింది, తనను తాను వృథా అనుకోవడం మొదలుపెట్టింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆమె తీవ్ర డిప్రెషన్‌లో ఉంది. తరచుగా నన్ను కౌగిలించుకుని ఏడ్చేది. ‘నా ఫాలోవర్లు తగ్గితే, నా కెరీర్ ముగిసిపోతుందా?’ అంటూ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది అని చెప్పింది

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..