- Telugu News Photo Gallery Thati bellam uses for skin heart diabetes constipation and more news in telugu lifestyle
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు..! కాళ్ల నొప్పుల నుంచి నెలసరి బాధల వరకు..
చెరుకుతో చేసే బెల్లమే కాదు తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి బెల్లంలో పోషకాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరని అంటున్నారు. పోషకవిలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు బదులుగా వాడొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారిలో ఎదురయ్యే నెలసరి సమస్యలు సహా పలురకాల అనారోగ్యాలను దూరం చేసి, ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో కలిగిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...
Updated on: May 01, 2025 | 7:48 AM

చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. టీ, కాపీ, పండ్ల రసాలలో తాటి బెల్లాన్ని వినియోగించవచ్చునని సూచిస్తున్నారు.

తాటి బెల్లం తరచూ తినడం వల్ల ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తాటి బెల్లం మీ పొట్టను శుభ్రపరుస్తుంది. పేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.

శరీరం ఆహారాన్ని బాగా గ్రహించడానికి తాటి బెల్లం సహాయపడుతుంది. గట్ లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు సహాయపడుతుంది. ఇది మలబద్దకం, జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పికి తలనొప్పితో బాధపడుతున్నవారు, మైగ్రేన్ తో ఇబ్బందిపడుతున్నవారు రోజూ చిన్న తాటి బెల్లం ముక్కను తింటే ఆ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా మహిళ్లల్లో ఎదురయ్యే పీరియడ్ నొప్పులకు తాటి బెల్లంతో ఉపశమనం కలిగిస్తుంది. పొత్తి కడుపు నొప్పి, తిమ్మిర్లు, వంటివి రాకుండా రక్షిస్తుంది. ఇది మీ శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. మూడ్ స్వింగ్స్ రాకుండా కూడా బయటపడేస్తుంది.

బరువు తగ్గడంలో కూడా తాటి బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో నిల్వ అయిన అధిక నీటిని బయటకు పంపుతుంది. నీటితో పాటూ వ్యర్థాలను విషాలను కూడా బయటకు నెడుతుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.




